నారద వర్తమాన సమాచారం
రాష్ట్రంలో ప్రజలు కోరుకున్న మార్పు మొదలైంది: లావు, ప్రత్తిపాటి
ఎన్నికలకు ముందు ప్రజలు ఏ మార్పు కోసమైతే ఓటుతో ప్రభంజనంలాంటి విజయం అందించారో రాష్ట్రంలో ఆ మార్పు మొదలైందన్నారు తెలుగుదేశం పార్టీ నర్సరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, చిలకలూరిపేట ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు. అన్నమాట ప్రకారం పింఛన్లు రూ.4 వేలు చేయడం నుంచి తిరిగి ఉచిత ఇసుక విధానం అమలు వరకు ప్రజలు ఏం కోరుకున్నారో అవ న్నీ ప్రభుత్వం కొలువుదీరిన స్వల్ప వ్యవధిలోనే అమల్లోకి తీసుకుని రావడం ముఖ్యమంత్రి చంద్ర బాబుకు మాత్రమే సాధ్యమైందన్నారు. ఇదే స్ఫూర్తితో కేంద్రం సహకారంతో అమరావతి, పోలవరం త్వరితగతిన పూర్తి చేయడం, కొత్త మౌలిక వసతుల ప్రాజెక్టులు, రహదార్లు, పోర్టులతో రాష్ట్రాన్ని తిరిగి అన్ని రంగాల్లో నంబర్-1 స్థానంలో నిలపడమే ప్రజాప్రభుత్వం లక్ష్యంగా చెప్పారు వారిద్దరు. ఆదివారం చిలకలూరిపేటలోని నివాసంలో ప్రత్తిపాటి పుల్లారావును ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా లావును శాలువాతో సత్కరించారు ప్రత్తిపాటి. పల్నాడు జిల్లాతో పాటు చిలకలూరిపేట నియోజకవర్గానికి సంబంధించిన పలు అంశాలపై ఇరువురు చర్చించారు. అనంతరం మాట్లాడిన ప్రత్తిపాటి రాష్ట్రం పైశాచికశక్తుల చెరవీడి తిరిగి అభి వృద్ధి పథంలో నడుస్తుండడం సంతోషాన్ని ఇస్తోందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉపము ఖ్యమంత్రి పవన్ వేగం, కేంద్రం నుంచి సానుకూల స్పందనతో సాధ్యమైనంత త్వరలోనే ప్రగతి పట్టాలెక్కడం ఖాయంగా కనిపిస్తోందన్నారు.