

రాష్ట్ర స్థాయి క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభం:
నారద వర్తమాన సమాచారం:భూదాన్ పోచంపల్లి:ప్రతినిధ
భూదాన్ పోచంపల్లి పద్మశాలి యువజన సంఘం అధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంట్ శుక్రవారం రోజు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు తడక వెంకటేశ్వర్లు ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తడక రమేష్, మున్సిపల్ వైస్ చైర్మన్ బాత్క లింగుస్వామి, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు భారత లవకుమార్, నేతాజీ యువజన సంఘం ఉపాధ్యక్షులు తడక గౌరీ శంకర్, 11 వార్డు కౌన్సిలర్ కుడికల అఖిల బలరాం, పద్మశాలి యువజన సంఘం గౌరవ అధ్యక్షులు సురపల్లి రాము పలాధి యాదగిరి, పద్మశాలి యువజన సంఘం అధ్యక్షులు గంజి యుగెందర్, ఉపాధ్యక్షులు రుద్ర చందు, ప్రధాన కార్యదర్శి అడేపు అరవింద్, సహాయ కార్యదర్శి అటిపాముల దర్మెందర్, కోశాధికారి సురపల్లి జగదీష్ సంఘం సభ్యులు మదినాల మహేష్, బోగ సాయి తేజ, ముషం శ్రీనివాస్, ఉదయ్ కుమార్, ఎలే శివ శంకర్ లు పాల్గొన్నారు.