నారద వర్తమాన సమాచారం
రేపు మొర్జంపాడు బుగ్గ మల్లేశ్వర స్వామి దేవస్థానంలో తొలి ఏకాదశి పర్వదిన వేడుకలు.
మాచవరం మండలం మొర్జంపాడు సమీపంలో గల శ్రీ భ్రమరాంబ సమేత బుగ్గ మల్లేశ్వర స్వామి వారి దేవస్థానంలో బుధవారం తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రత్యేక పూజా కార్యక్రమాలతో పాటు స్వామివారి శివలింగానికి అభిషేక కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నట్లు ఆలయ శాశ్వత ధర్మకర్తలు మండాది హరినాథ్ మంగళవారం తెలిపారు ఈ కార్యక్రమానికి భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వామి వారి దర్శించుకుంటారని ఇప్పటికే ఆలయ పరిసర ప్రాంతాల్లో భక్తుల కొరకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని హరినాథ్ తెలిపారు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు ఉచిత ప్రసాదాలు కూడా అందజేస్తామన్నారు .