రైతులకు రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదే
సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేస్తున్న జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు సామ మధుసూదన్ రెడ్డి
నారద వర్తమాన సమాచారం: భూదాన్ పోచంపల్లి, ప్రతినిధి:
మండలంలో శుక్రవారం జూలూరు గ్రామంలో కాంగ్రెస్ గ్రామ శాఖ ఆధ్వర్యంలో రైతులకు రుణమాఫీ చేసిన నేపథ్యంలో సీఎం చిత్రపటానికి పాలాభిషేకం కార్యక్రమాన్ని నిర్వహించగా ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా డిసిసి జిల్లా ఉపాధ్యక్షులు సామ మధుసూదన్ రెడ్డి హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి నాయకులతో కలిసి పాలాభిషేకం కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం పట్టణ గ్రామ కేంద్రంలో ర్యాలీ నిర్వహించి సీఎం కి అనుకూలంగా నినాదాలు చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆనాడు రాజశేఖరరెడ్డి తర్వాత రైతుల మేలుకోరిన ఏకైక వ్యక్తి రేవంత్ రెడ్డి అని ఆయన కితాబులు ఇచ్చారు.
పదేండ్లలో టిఆర్ఎస్ పాలనలో సాధ్యం కానీ రైతుల రుణమాఫీ సీఎం రేవంత్ రెడ్డి ఆరు నెలల పాలనలో సాధ్యమైందని కొనియాడారు. రైతు పక్షపాతి ప్రభుత్వంగా కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తుందని రానున్న రోజుల్లో ఇచ్చిన హామీలను నిలబెట్టుకొని తెలంగాణ అభివృద్ధి చేస్తుందని ఆయన తెలిపారు.
ఈ కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షులు కాసుల అంజయ్య, సెల్ మండల అధ్యక్షులు దాసరి నరసింహ, మండల ప్రధాన కార్యదర్శి తోట శ్రీనివాస్, గ్రామ అధ్యక్షులు పాముకుంట్ల దయాకర్, నాయకులు బాలకృష్ణ, బాబు, వెంకటేష్, జంగయ్య, నజీర్, రాజేష్, తదితరులు పాల్గొన్నారు..