నారద వర్తమాన సమాచారం
ఖమ్మం జిల్లా.
రైతు ఆత్మహత్యకు కారకులైన వారిని కఠినంగా శిక్షించాలి..
బిఆర్ఎస్ పార్టీ అధినేత కేసిఆర్ గారి ఆదేశాలతో మృతి చెందిన రైతు బోజేడ్ల ప్రభాకర్ కుటుంబానికి న్యాయం జరగాలని ఆకాంక్షిస్తూ ఖమ్మం పోలీస్ కమిషనర్ ని కలిసిన బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రతినిధుల బృందం.
ఖమ్మం జిల్లా చింతకాని మండలం పొద్దుటూరు గ్రామం రైతు బోజేడ్ల ప్రభాకర్ ఆత్మహత్యకు కారకులైన దోషులను కఠినంగా శిక్షించాలని మృతిని కుటుంబానికి సర్వత న్యాయం చేయాలని ప్రభుత్వం నుండి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించాలని ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్ కి వినతి పత్రం అందజేసిన బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రతినిధుల బృందం సభ్యులు మాజీ వ్యవసాయ శాఖ మంత్రివర్యులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, పార్టీ ప్రధాన కార్యదర్శి జనగాం ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎమ్ ఎల్ సీ & ఖమ్మం జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు తాతా మధుసూదన్, జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజ్, మాజీ శాసనసభ్యులు సండ్ర వెంకట వీరయ్య, రాష్ట్ర నాయకులు ఏనుగుల రాకేష్ రెడ్డి, ఆర్.జె.సి కృష్ణ గార్లు..
ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమకారులు ఉప్పల వెంకటరమణ, ఖమ్మం నగర పార్టీ అధ్యక్షుడు పగడాల నాగరాజు, రూరల్ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు బెల్లం వేణు, రఘునాథ్ పాలెం మండలం బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు వీరు నాయక్, మైనార్టీ నాయకుడు తాజుద్దీన్, భాష బోయిన వీరన్న, పగడాల నరేందర్, లింగన్న బోయిన సతీష్, మరియు ఇతర నాయకులు తదితరులు పాల్గొన్నారు.