నారద వర్తమాన సమాచారం
రోడ్డు పైకి చేపలు..!
అంబేద్కర్ కోనసీమ జిల్లా
అంతర్వేది.
రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు నదులు, కాల్వలు పొంగిపొర్లుతున్నాయి.
దీంతో లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురయ్యే అవకాశం ఉండడంతో అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
కాగా, ప్రముఖ పుణ్యక్షేత్రం సఖినేటిపల్లి మండలం అంతర్వేదిలోని లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం జలమయమైంది.
వరద నీటిలో ఉన్న చేపలను స్థానికులు రోడ్లపై వలలు వేసి పట్టుకుంటున్నారు.
చేపలు రోడ్డుపైకి రావడంతో.. వాటిని చూసేందుకు జనం పోటెత్తారు.