నారద వర్తమాన సమాచారం
రూట్ మార్చిన మాజీ సిఎం జగన్.. రేపట్నుంచి ప్రజా దర్బార్..?
వైసీపీ అధినేత వైఎస్ జగన్ ప్రజలతో మమేకమయ్యేందుకు సిద్ధమవుతున్నారు.
ఎన్నికల్లో ఓటమి తర్వాత పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలతో సమావేశమైన ఆయన పార్టీ ఓటమి సంబంధించి నేతలకు భరోసాను కల్పించే ప్రయత్నం చేశారు.
ఇదే క్రమంలో రేపటి నుంచి తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ప్రజా దర్బార్ నిర్వహించేందుకు జగన్ సిద్ధమవుతున్నట్లు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
ఇందుకోసం జోరుగా ఏర్పాటు చేస్తున్నట్లు తెలుస్తోంది.