నారద వర్తమాన సమాచారం
శాసనసభ ఎన్నికల ప్రచారం సందర్భంగానూ, పాదయాత్ర సమయంలో రైతు భరోసా ఇస్తామని చెప్పాము.
రైతు భరోసాను నిర్దిష్టంగా అమలు చేసేందుకు రైతాంగ సోదరులు, ఇతర వర్గాల వారితోను చర్చిస్తాం. అందరి అభిప్రాయాలు తీసుకుని గరిష్టమైన మేలు రైతులుకు చేసేలా ఇందిరమ్మ రాజ్యంలోని కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం నిర్ణయాలు చేస్తుంది.
మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిగారుకానీ, ప్రభుత్వ మంత్రులు కానీ ఎవ్వరూ మాకు మేము నిర్ణయాలు చేయము. రైతుల కోసం ఖర్చు చేసే ప్రతి పైసా మీరు కట్టే పన్నుల ద్వారా వచ్చే ఆదాయమే.
అందుకే అన్ని జిల్లాల రైతాంగ సోదరులు, ఇతర వర్గాల ప్రజలతో చర్చించి, మీరు చెప్పే అంశాలను క్రోడీకరించి అంతిమంగా చట్టసభలో పెట్టి నిర్ణయాలు చేయడం జరుగుతుంది.
ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క