నారద వర్తమాన సమాచారం
శ్రీ సిమెంట్ ఫ్యాక్టరీ గేటు వద్ద గ్రామ ప్రజల నిరసన
పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం దాచేపల్లి మండలం పెదగార్లపాడు గ్రామంలోని శ్రీ సిమెంట్ ఫ్యాక్టరీ నుండి పెద్ద మొత్తంలో సిమెంట్ డస్ట్ గ్రామంలోని ఇళ్ళమీద పంట పొలాల మీద పడడంతో
పశువులు మేత తినేందుకు కూడా ఇబ్బందులు పడుతున్నాయని తమకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని పెదగార్లపాడు ప్రజలు శ్రీ సిమెంట్ ఫ్యాక్టరీ ప్రధాన ద్వారం వద్ద బయటాయించి నిరసన వ్యక్తం చేశారు
ఫ్యాక్టరీ యాజమాన్యం తక్షణమే స్పందించి ఎయిర్ పొల్యూషన్ కు సంబంధించి ఎయిర్ డస్ట్ గ్రామంలోకి రాకుండా ఏర్పాటు చేసుకోవాలని వాళ్ళు డిమాండ్ చేశారు
సిమెంట్ ఫ్యాక్టరీ యజమాన్యం తక్షణమే స్పందించకుంటే నిరసన తీవ్రతరం చేస్తామని పెదగార్లపాడు ఫ్యాక్టరీ యాజమాన్యాన్ని ప్రజలుహెచ్చరించారు