

సామాజిక న్యాయం ఒక్క జగన్ తోనే సాధ్యం: బొల్లా గిరిబాబు
నారద వర్తమాన సమాచారం :వినుకొండ:ప్రతినిధి
పట్టణంలోని 1వ వార్డు ప్రచారంలో భాగంగా స్థానిక ప్రజలతో ముచ్చటిస్తూ వారి సమస్యలను భరోసానిస్తూ, మద్దతు కూడా గడుతూ ముందుకు సాగారు..
రాష్ట్రంలో సామాజిక న్యాయం ఒక్క జగన్మోహన్ రెడ్డి తోనే సాధ్యమని వినుకొండ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు తనయుడు యువ నాయకులు బొల్లా గిరిబాబు అన్నారు. ప్రభుత్వంలోనూ పార్టీలోనూ యస్ సి యస్టీ బిసి, ముస్లిం మైనారిటీలకు, మహిళలకు సముచిత స్థానం కల్పించిన ఘనత జగన్మోహన్ రెడ్డి దేన్ని గిరిబాబు కొని ఆడారు. జగన్మోహన్ రెడ్డి ని ఎదుర్కొనే ధైర్యం లేక ప్రతిపక్షాలు ఏకమై వస్తున్నాయని , ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తూ బురద జల్లే ప్రయత్నం చేస్తున్న కూటమికి ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పాలని ఆయన పిలుపునిచ్చారు.
పట్టణంలో మార్పులకు శ్రీకారం చుట్టి అభివృద్ధి పథంలో నడిపిస్తున్న బొల్లా బ్రహ్మనాయుడు ని మరోమారు ఎమ్మెల్యేగా గెలిపించుకొని వినుకొండను అన్ని విధాల అభివృద్ధి చేసుకునేందుకు ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ప్రతిపక్ష నాయకులు జీవి ఆంజనేయులు, మక్కెన మల్లికార్జునరావు పనిగట్టుకుని బొల్లా బ్రహ్మనాయుడు పై చేస్తున్న దుష్ప్రచారాన్ని గిరిబాబు ఖండించారు. ప్రజలు అంటే పడని చంద్రబాబు నాయుడుకి పేదల పక్షాన నిలిచిన జగన్మోహన్ రెడ్డికి జరుగుతున్న కురుక్షేత్ర యుద్ధంలో ప్రతి కార్యకర్త సైనికుడిలా పనిచేయాలని గెలుపునిచ్చారు.
బొల్లా బ్రహ్మనాయుడు కి, ఎంపీ అభ్యర్థి అనిల్ కుమార్ కి ఫ్యాన్ గుర్తు పై ఓట్లు వేసి గెలిపించాలని గిరిబాబు విజ్ఞప్తి చేశారు.