నారద వర్తమాన సమాచారం
సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ కు పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు
జిల్లా ఎస్.పి శ్రీ సిద్దార్థ్ కౌశల్ ఐ.పి.ఎస్ వెల్లడి
కడప మే 18:
జూన్ నెల 4 న కౌంటింగ్ జరగనున్న నేపథ్యంలో జిల్లా ఎస్.పి శ్రీ సిద్దార్థ్ కౌశల్ ఐ.పి.ఎస్ గారు శనివారం స్థానిక వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో పోలీస్ అధికారులతో సూక్ష్మ స్థాయిలో సమీక్ష నిర్వహించి దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్బంగా జిల్లా ఎస్.పి గారు కౌంటింగ్ సందర్బంగా క్షేత్ర స్థాయిలో ఎక్కడెక్కడ, ఎవరు, ఎలా విధులు నిర్వహించాలో ఆదేశాలిచ్చారు.
కౌంటింగ్ నేపథ్యంలో జూన్ నెల 1 నుండి 6 వరకూ ఎలాంటి ఊరేగింపులు, విజయోత్సవ ర్యాలీలకు అనుమతి లేదని ఎస్.పి తెలిపారు.
శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగానే రాజకీయ నేతల గృహనిర్బంధాలు, జిల్లా బహిష్కరణ అమలు చేయడం జరుగుతుందని ఎస్.పి వివరించారు. ఎవరైనా శాంతిభద్రతలకు భంగం కలిగిస్తే వారిపై కూడా నాన్ బెయిలబుల్ సెక్షన్ల క్రింద కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా ఎస్.పి శ్రీ సిద్దార్థ్ కౌశల్ ఐ.పి.ఎస్ పేర్కొన్నారు. సమావేశంలో కడప డి.ఎస్.పి ఎం.డి షరీఫ్, ఎస్.బి ఇన్స్పెక్టర్ జి.రాజు, వన్ టౌన్ సి.ఐ సి.భాస్కర్ రెడ్డి, నగరంలోని సి.ఐ లు, ఎస్.ఐ లు పాల్గొన్నారు.