Tuesday, April 8, 2025
Homeతెలంగాణసీఎం రేవంత్ నిరుద్యోగ యువకులు విద్యార్థులపై చేసిన వ్యాఖ్యలపై తీవ్రంగా మండిపడ్డ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్...

సీఎం రేవంత్ నిరుద్యోగ యువకులు విద్యార్థులపై చేసిన వ్యాఖ్యలపై తీవ్రంగా మండిపడ్డ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

నారద వర్తమాన సమాచారం

సీఎం రేవంత్ నిరుద్యోగ యువకులు విద్యార్థులపై చేసిన వ్యాఖ్యలపై తీవ్రంగా మండిపడ్డ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

రేవంత్ తన అడ్డగోలు వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకొని యువతకు క్షమాపణ చెప్పాలని డిమాండ్.

కేటీఆర్ కామెంట్స్

నిర్లక్ష్యంగా, నిర్లజ్జగా ముఖ్యమంత్రి తన స్థాయికి దిగజారి, అత్యంత దివాళకోరుతనంతో మాట్లాడారు

నిరుద్యోగుల కోసం పోరాటం చేస్తున్న మోతీలాల్ ని అవమానించేలా మాట్లాడారు

అశోక్ నగర్ కోచింగ్ సెంటర్లకు వెళ్లి ఉద్యోగాలు సంపాదించుకున్న రేవంత్ రెడ్డి అదే కోచింగ్ సెంటర్లను, వారిని అవమానించేలా మాట్లాడుతున్నారు

అందుకే ఈరోజు తెలంగాణ యువత భగ్గుమంటుంది..

మమ్మల్ని దించి మిమ్మల్ని గద్దెనెక్కించిన అదే యువత ఈరోజు మిమ్మల్ని ప్రశ్నిస్తున్నది

8 నెలల్లో ఇప్పటిదాకా ఒక్క నోటిఫికేషన్ ఇయ్యని మీరు, మిగిలిన నాలుగు నెలల్లో ఏవిధంగా రెండు లక్షల నోటిఫికేషన్లు ఇస్తారో చెప్పాలి

మిమ్మల్ని వదిలిపెట్టము… క్షేత్రంలో నిలదీస్తాం విద్యార్థులతో నిరుద్యోగులతో కలిసి కొట్లాడుతాం

ఇది రాజకీయ పార్టీల సమస్య కాదు… లక్షలాదిమంది యువతకు సంబంధించిన అంశం

ఈ అంశంలో రేవంత్ రెడ్డి ఈగోకి, బేషజాలకు పోకుండా నిర్ణయం తీసుకోవాలి

కండకావరం తో మాట్లాడడం రేవంత్ రెడ్డి ఆపాలి

రేవంత్ నిరుద్యోగులు విద్యార్థులపై చేసిన తన వ్యాఖ్యలకి క్షమాపణ చెప్పాలి

రాజకీయ నిరుద్యోగులుగా యువతను రెచ్చగొట్టిన రాజకీయ శక్తులు ముమ్మటికే రేవంత్, రాహుల్ గాంధీలే

గతంలో ఏ పరీక్ష రాస్తుండని రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి నిరుద్యోగులతో దీక్ష చేసిందో చెప్పాలి

అశోక్ నగర్ లోని విద్యార్థులను సన్నాసులు అంటున్న రేవంత్… మీరు సన్నాసులా… రాహుల్ గాంధీ సన్నాసులా అనే విషయం చెప్పాలి

అశోక్ నగర్ లో.. యూనివర్సిటీలో పిల్లలను ఈడ్చుకుపోతున్న అంశం వాస్తవం కాదా రేవంత్ రెడ్డి చెప్పాలి

రేవంత్ రెడ్డి ఇంకా ప్రతిపక్షంలో ఉన్నట్లుగానే మాట్లాడుతున్నాడు… ఆయన ముఖ్యమంత్రిని అనే విషయాన్ని గుర్తుంచుకొని మాట్లాడితే ఆయనకే మంచిది

రేవంత్ రెడ్డికి సత్తా ఉంటే చిత్తశుద్ధి ఉంటే ఉద్యోగాల పైన, నోటిఫికేషన్ల పైన, జాబ్ క్యాలెండర్ పైన శ్వేత పత్రం ప్రకటించాలి

నిరుద్యోగులు అడుగుతున్న డిమాండ్లను వెంటనే సానుకూలంగా నిర్ణయం తీసుకోవాలి

గ్రూప్ వన్ మెయిన్స్ రేషియోను 1:100 గతంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీని నెరవేర్చాలి

అక్టోబర్ నవంబర్ 2023లో తెలంగాణ యువతను రెచ్చగొట్టి అప్పటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా విద్యార్థులను నిరుద్యోగులను రెచ్చగొట్టారు

అనేక అవాకులు చావాకులు పేలి, రాజకీయ నిరుద్యోగాన్ని తీర్చుకోవడానికి రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి యువతను రెచ్చగొట్టారు

మేము అధికారంలోకి రాగానే వందల నోటిఫికేషన్లు, రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఒక్క సంవత్సరంలో ఇస్తామని నమ్మబలికారు

నోటిఫికేషన్ల తేదీల సహా అనేక ప్రకటనలు కూడా ఇచ్చారు

ఇప్పుడు ఒకాయన ముఖ్యమంత్రి అయిండు…ఇంకొక ఆయన జాతీయస్థాయిలో నాయకుడు అయిండు.. కానీ తెలంగాణ నిరుద్యోగులకు దక్కింది శూన్యం

కానీ ఇప్పటిదాకా ఒక్క ఉద్యోగాన్ని కానీ నోటిఫికేషన్ కానీ ఇయ్యలేదు

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటిదాకా ఒక్క ఉద్యోగాన్ని కూడా నింపలేదు

ఈరోజు అశోక్ నగర్, దిల్షుక్నగర్, రాష్ట్రంలోని యూనివర్సిటీలో అడుగుతున్న విద్యార్థులు అడుగుతున్నది కాంగ్రెస్ ఇచ్చిన హామీలనే కదా

రెండు లక్షల ఉద్యోగాల గురించి అడుగుతున్నారు

గ్రూప్ 2 గ్రూప్ 3లో పోస్టులను పెంచమని అడుగుతున్నారు

50వేల ఉద్యోగాలతో వేస్తామన్న మెగా డీఎస్సీ గురించి అడుగుతున్నారు

కానీ ఇవి అడుగుతున్న నిరుద్యోగులు, యువకుల పైన ముఖ్యమంత్రి అత్యంత దివాళకోరుతనంతో మాట్లాడారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Need Help?