నారద వర్తమాన సమాచారం
సుప్రీంకోర్టు న్యాయ మూర్తులుగా జస్టిస్ ఎన్.కోటీశ్వర్ సింగ్, జస్టిస్ ఆర్.మహదేవన్ బాధ్యతలు
గురువారం సుప్రీంకోర్టు ప్రాంగణంలో జరిగిన కార్యక్రమంలో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ వారితో ప్రమాణం చేయించారు. దీంతో సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య 34కు చేరింది. ఈశాన్య రాష్ట్రం మణిపూర్ నుంచి సుప్రీంకోర్టు తొలి జడ్జిగా జస్టిస్ కోటీశ్వర్ సింగ్‌కు ప్రాతినిధ్యం దక్కిన సంగతి తెలిసిందే.. అంతకుముందు జమ్మూ కశ్మీర్, లడఖ్ ప్రధాన న్యాయమూర్తిగా కోటీశ్వర్ సింగ్, మద్రాస్ హైకోర్టు తాత్కాలిక న్యాయమూర్తిగా మహదేవన్ పనిచేశారు