నారద వర్తమాన సమాచారం
తెలంగాణ
సూర్యాపేటలో దారుణం.. గంజాయి మత్తులో యువకుల వీరంగం
సూర్యాపేట జిల్లా కేంద్రంలో దారుణం చోటుచేసుకుంది. గంజాయి మత్తులో నలుగురు యువకులు వీరంగం సృష్టించారు. స్థానిక అంజలి స్కూల్ సమీపంలో యువకుడిపై దాడి చేశారు. అందరూ చూస్తుండగానే ఈ గ్యాంగ్ రెచ్చిపోయింది. కాపాడే ప్రయత్నం చేసిన వారిపై కూడా దాడి చేశారు. కొంతకాలంగా సూర్యాపేటలో గంజాయి బ్యాచ్ ఆగడాలు మితిమీరి పోతున్నాయి. స్థానికులు భయభ్రాంతులకు గురవుతున్నారు.