నారద వర్తమాన సమాచారం
సైనికుల కుటుంబాలకు అండగా ఉంటాం: రాజ్‌నాథ్‌సింగ్ …
సైనికుల కుటుంబాలకు అండగా ఉంటాం: రాజ్‌నాథ్‌సింగ్
జమ్మూకశ్మీర్‌లో జరిగిన ఉగ్రదాడిలో ఒక ఆర్మీ అధికారి సహా ముగ్గురు జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. సైనికులు మరణించడంపై రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్పందించారు. ‘ధైర్యసాహసాలు కలిగిన సైనికులు ఉగ్రదాడిలో వీరమరణం పొందడం బాధిస్తోంది. మృతుల కుటుంబాలకు నా సానుభూతి. ప్రాణత్యాగం చేసిన సైనికుల కుటుంబాలకు దేశం అండగా ఉంటుంది. తీవ్రవాద వ్యతిరేక కార్యకలాపాలు కొనసాగుతాయి. ఈ ప్రాంతంలో శాంతిని పునరుద్దరించడానికి కట్టుబడి ఉన్నాం’ అని తెలిపారు.