నారద వర్తమాన సమాచారం
నేడు ఆప్ ప్రచారాన్ని ప్రారంభించనున్న సునీతా కేజ్రీవాల్
నేడు ఆప్ ప్రచారాన్ని ప్రారంభించనున్న సునీతా కేజ్రీవాల్
హర్యానా అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి ఆమ్ ఆద్మీ పార్టీ సిద్ధమవుతోంది. ఇందుకోసం పార్టీ జాతీయ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్ రంగంలోకి దిగనున్నారు. హర్యానాలోని పంచకులలో శనివారం జరగనున్న సమావేశంలో ‘కేజ్రీవాల్ గ్యారంటీ’లను ఆమె ప్రకటించనున్నారు. కాగా, త్వరలో జరగనున్న హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 90 స్థానాల్లో పోటీ చేయనున్నట్లు ఆప్ ఇప్పటికే ప్రకటించింది