రిపబ్లిక్ హిందుస్థాన్, సిరికొండ : అదిలాబాద్ జిల్లాలోని సిరికొండ మండలం లో గుప్త నిధుల కోసం తవ్వకాల జరుపుతున్నట్లు ఆనవాళ్లు బయటపడ్డాయి.
గుప్తనిధుల కోసం మహారాష్ట్రలోని ముఠాలు మండల కేంద్రంలోని పలు గ్రామాల్లో పర్యటిస్తూన్నట్లు వదంతులు వ్యాపిస్తున్నాయి. తాజాగా సిరికొండ మండలంలోని కొండాపూర్ గ్రామ శివారులో గల ఒక వ్యవసాయ క్షేత్రంలో గుప్తనిధుల కోసం తవ్వకాలు చేసిన ఆనవాళ్లు కనిపించడంతో చుట్టుపక్కల గ్రామాలోని ప్రజలు ఉలిక్కిపడ్డారు. ఈ ఘటనతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. గత కొన్ని రోజుల క్రితం ఉట్నూర్ మండలం లో గుప్తనిధుల తవ్వకాలు వేటలో ఓ వ్యక్తి మృతి చెందిన విషయం తెలిసిందే.
పురాతన కట్టడాలే లక్ష్యంగా తవ్వకాలు?
సిరికొండ ప్రాంతంలో గతంలోను తరుచుగా తవ్వకాలుజరిగాయి. గతంలో పురాతన కట్టడాల అవశేషాలు బయటపడడంతో ఈ ప్రాంతం పై ప్రత్యేక దృష్టి పెట్టిన గుప్త నిధుల వేటగాల్లు.
గుప్త నిధుల కోసం మహరాష్ట్ర నుండి నిపుణులను తీసుకొచ్చి ప్రత్యేక బృందాలతో వేటను కొనసాగిస్తున్నట్లు పుకార్లు జోరందుకున్నాయి.
విచారణ చేపట్టిన పోలీసులు
గుప్త నిధులు జరిగిన ప్రాంతాన్ని పోలీసులు పరిశీలించారు. నిందితుల కోసం విచారణ చేపట్టినట్లు సమాచారం.