రిపబ్లిక్ హిందుస్థాన్, ఇచ్చోడ : గతంలో ప్రజల సౌకర్యార్థం మంచినీటి సరఫరా కోసం ప్రభుత్వము పాత బస్టాండ్ దగ్గర బోరు వేసి ఆ బోరు గుండా మండల కేంద్రంలోని అన్ని కాలనీలకు నీటిని సరఫరా చేసేవారు. బోరు సామాగ్రి, స్టార్టర్ కోసం ప్రభుత్వం ప్రత్యేకించి ఒక గదిని కూడా నిర్మించింది. కాలానుక్రమం ప్రభుత్వం ప్రజలకు త్రాగునీరు కోసం ట్యాంకులు నిర్మించి మంచినీటిని సరఫరా చేయడంతో పాత బస్టాండ్ సమీపంలో వద్ద ఉన్న బోరు నిరుపయోగంగా మారింది. సామాగ్రి పెట్టడం కోసం నిర్మించిన గది కూడా నిరుపయోగంగా మారింది. నిరుపయోగంగా ఉన్న బస్టాండ్ ప్రాంతంలో ఇప్పుడు భూమి విలువ కొన్ని లక్షల్లో ఉంది. ఇంకేం నెమ్మదిగా ఆ గదిని మాయం చేసే పనిలో పడ్డారు కొంతమంది. ఇదే అదునుగా భావించి ఈ గదిని కొంత భాగాన్ని ఆక్రమించుకొని ఒక వ్యక్తి ఇల్లు సైతం నిర్మాణం చేపట్టాడు అని గతంలో విమర్శలు వెలువెత్తాయి. మిగిలి ఉన్న కొంత గది నిర్మాణం సైతం పూర్తిగా మంగళవారం అనూహ్యంగా, ఆకస్మాత్తుగ అర్థం కాని రీతిలో కూలిపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. గ్రామపంచాయతీలో చక్రం తిప్పే నాయకుడు దగ్గరుండి ఈ భవనం మాయం అయ్యేలా సపోర్ట్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. గ్రామపంచాయతీ అధికారులకు, పాలకులకు తెలియకుండా ఏ పని జరగదని, అలాంటిది ప్రభుత్వం భవనం మాయమవుతున్నా ఎందుకు పాలకవర్గం పట్టించుకోవడం లేదని ప్రజలు విమర్శిస్తున్నారు. వారి అండదండనలతోనే గదిని కావాలనే కూల్చివేశారు అని విమర్శలు వెలువెత్తుతున్నాయి. ప్రభుత్వ ఆస్తులను కాపాడాల్సిన అధికారుల నిర్లక్ష్యంతోనే కొందరు అక్రమాలకు పాల్పడుతున్నారని ప్రజలు చర్చించుకుంటున్నారు. ఏదేమైనా పట్టణం చుట్టు ఏదొక చోట ప్రభుత్వ స్థలాలు, భవనాలు కబ్జాకు గురవుతున్న ఈ విషయాలను మాములు విషయంగా తీసుకోవడం వల్ల కబ్జా కోర్ లో రెచ్చిపోతున్నారు. గతంలో కూడా మురికి కాలువలు కబ్జా చేసి పక్క నిర్మాణాలు చేపట్టిన దాఖలాలు ఉన్నాయి. ఆ గది ఎవరు కూల్చివేశారు విచారణ జరిపి సదరు వ్యక్తుల పైన చర్యలు తీసుకొని ప్రభుత్వ ఆస్తులు, ప్రభుత్వ భూములు కబ్జాలకు గురికాకుండా కాపాడాలని మండల ప్రజలు కోరుతున్నారు.
నెమ్మదిగా కబ్జా…!? ….. బస్టాండ్ సామాగ్రి గది కూల్చేశారా..? కూలిపోయిందా..?
RELATED ARTICLES
Recent Comments
Hello world!
on