రిపబ్లిక్ హిందుస్థాన్, పాలకవీడు :
సూర్యాపేట జిల్లా గిరిజన చైతన్య యాత్ర పాలకవీడు మండలంలోని శూన్యపాడు గ్రామంలో మాజీ ఎమ్మెల్యే సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి ప్రారంభించారు.
అనంతరం ప్రారంభ సభను ఉద్దేశించి మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి మాట్లాడుతూ ఎన్నో సంవత్సరాలుగా అడవి నీ నమ్ముకుని బ్రతుకుతున్న గిరిజనులు అటవీ భూములను సాగు చేసుకుంటూ జీవిస్తున్నారని వారికి పట్టాలు ఇవ్వాలని అనేక సంవత్సరాలుగా సిపిఎం పార్టీ గిరిజన సంఘం ఆధ్వర్యంలో పోరాటం చేసిన ఫలితంగా 2006లో వామపక్ష పార్టీలు పార్లమెంటులో బలపరిచిన సందర్భంగా అప్పటి యూపీఏ ప్రభుత్వం అటవీ హక్కుల చట్టం తెచ్చిందని ఆయన అన్నారు.
అటవీ హక్కుల చట్టం వచ్చిన తర్వాత అనేక పోరాటాల ఫలితంగా గిరిజనులకు ఆరకూర పట్టాలు ఇచ్చారు తప్ప ఎవరికి ప్రయోజనం చేకూరాలేదని ఆయన అన్నారు. రాష్ట్రంలో 11 లక్షల 40 వేల మంది అటవీ హక్కుల చట్టం కింద సాగు చేసుకుంటున్న గిరిజనులు పట్టాలు ఇవ్వాలని దరఖాస్తు చేసుకున్నారని ఇట్టి విషయమై సిపిఎం పార్టీ బృందం మరియు గిరిజన గిరిజన సంఘం నాయకులతో కలిసి మన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు వివరించామని అందరికీ పట్టాలిస్తామని హామీ ఇచ్చారని ఆయన అన్నారు కానీ ఆచరణలో అది సాధ్యం చేయటం లేదని విమర్శించారు. గత మునుగోడు ఎన్నికల ముందు ఫిబ్రవరిలో సాగు చేసుకుంటున్న గిరిజన సోదరులందరికీ పట్టాలిస్తామని కెసిఆర్ హామీ ఇచ్చారని ఫిబ్రవరి నెలలో పట్టాలిస్తామని చెప్పారని అయిన ఇంతవరకు నెరవేర్లేదని ఆయన విమర్శించారు. సిపిఎం సిపిఐ ఒత్తిడి ఫలితంగా నిన్న అసెంబ్లీలో అందరికీ హక్కు పట్టాలిస్తామని చెప్పారని ఆయన పేర్కొన్నారు కానీ రాష్ట్రంలో 11 లక్షల మంది గిరిజనులు దరఖాస్తు చేసుకుంటే కేవలం నాలుగు లక్షల మందికి హక్కు పత్రాలు ఇస్తామనటం న్యాయం కాదని ఆయన పేర్కొన్నారు సాగు చేసుకుంటూ అనుభవిస్తున్నటువంటి దరఖాస్తు చేసుకున్న ప్రతి గిరిజన కుటుంబానికి హక్కు పత్రాలు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. లేనియెడల తెలంగాణ గిరిజన సంఘం ఆధ్వర్యంలో చేస్తున్న పోరాటాలకు సిపిఎం పార్టీ అండ దండగ నిలుస్తుందని ఆయన అన్నారు.
ఈ కార్యక్రమంలో సిపిఐ ఎం పార్టీ మండల కార్యదర్శి కందగట్ల అనంత ప్రకాష్ మాట్లాడుతూ తెలంగాణ గిరిజన సంఘం చేస్తున్న పోరాటంలో సిపిఎం పార్టీ సంపూర్ణ మద్దతిస్తుందని ఆయన తెలియజేశారు. జిల్లాలో 4200 మంది పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని దరఖాస్తు చేసుకుంటే కేవలం 83 కుటుంబాలకే పట్టాలు ఇవ్వాలని డిఎల్సి నిర్ణయించిందని, ఇది అన్యాయం అని ఆయన పేర్కొన్నారు. అదేవిధంగా పాలకవీడు మండలంలో 2004 మంది దరఖాస్తు చేసుకున్నారని కేవలం 49 మందిని ఎంపిక చేశారని ఇది అవాస్తవం ఆశాస్త్రీయంగా ఉన్నదని దరఖాస్తు చేసుకున్నటువంటి ప్రతి గిరిజన కుటుంబాలను విచారణ చేసి ప్రతి ఒక్కరికి హక్కు పత్రాలు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. లేనియెడల తెలంగాణ గిరిజన సంఘం చేస్తున్న ప్రతి ఆందోళనలో సిపిఎం పార్టీ మద్దతునిస్తూ ప్రత్యక్షంగా పాల్గొంటూ వారి సమస్యల పరిష్కారం కోసం నిలబడుతుందని ఆయన తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ధీరావత్ రవి నాయక్, రాష్ట్ర సహాయ కార్యదర్శి మూడవత్ రవి నాయక్, జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఎం బాలు నాయక్, భారత రాజేందర్ నాయక్, రాష్ట్ర ముఖ్య నాయకులు పాండు నాయక్ పాపా నాయక్, ఉదయ నాయక్, వినోద్ నాయక్, రాజు నాయక్, హతి రామ్ నాయక్, కిషన్ నాయక్, చంద్ర సింగ్ నాయక్, వాలీబాయి, రత్నావతి, వినోద్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.
అటవీ భూములు సాగు చేసుకుంటున్న గిరిజనులందరికి అటవీ హక్కు పత్రాలు ఇవ్వాలి : మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి డిమాండ్
Recent Comments
Hello world!
on