100 గంజాయి మొక్కలను ద్వంసం చేసిన అధికారులు
రిపబ్లిక్ హిందూస్థాన్, ఆదిలాబాద్ : ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండలం లోని ఉమ్రి బి గ్రామ శివారులో 100 గంజాయి మొక్కలను స్పెషల్ బ్రాంచి అధికారులు పోలీసులు , ఎక్సయిజ్ శాఖ అధికారులతో కలిసి ద్వంసం చేశారు.
ఎక్సయిజ్ సిఐ చంద్రమౌళి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఉమ్రి గ్రామ శివారులో గలా ఆత్రం అమృత రావు, ఆత్రం జంగు, శాంతా పూర్ గ్రామానికి చెందిన సాయి మల్లు చేనులలో దాదాపు 100 గంజాయి మొక్కలను గుర్తించి ద్వంసం చేశారు.

ఈ కార్యక్రమంలో గుడిహత్నూర్ స్పెషల్ బ్రాంచ్ అధికారి స్వామి , బజార్ హత్నుర్ స్పెషల్ బ్రాంచ్ అధికారి అమృత్ రెడ్డి , ఇచ్చోడ ఎక్సైజ్ సీఐ చంద్రమౌళి , గుడిహత్నూర్ ఎస్ఐ ప్రవీణ్ గంజాయి మొక్కలను ద్వంసం చేశారు.