◾️ నూతన జాతీయ విద్యా విధానం- 2020 ని రద్దు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన టిఎస్ యుటిఎఫ్ రాష్ట్ర అధ్యక్షు కే. జంగయ్య
రిపబ్లిక్ హిందుస్థాన్, సూర్యాపేట :
ఆదివారం నేరేడుచర్లలోని ఏ-1 ఫంక్షన్ హాల్ లో సూర్యాపేట జిల్లా టిఎస్ యుటిఎఫ్ నాలుగో మహాసభలు నేరేడుచర్ల గరిడేపల్లి పాలకవీడు మండలాల సౌజన్యంతో జిల్లా అధ్యక్షులు సిరికొండ అనిల్ కుమార్ అధ్యక్షతన నిర్వహించారు. టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు కే జంగయ్య మహాసభల ను ప్రారంభించి మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర బడ్జెట్లలో విద్యారంగానికి నిధుల కేటాయింపులు పెంచాలని, నూతన జాతీయ విద్యా విధానాన్ని రద్దు చేయాలని, సిపిఎస్ విధానాన్ని రద్దుచేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
జిల్లా మహాసభలకు ముఖ్యఅతిథిగా హాజరైన హుజూర్నగర్ శాసనసభ్యుడు శానంపూడి సైదిరెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్యకు ప్రాధాన్యతలో భాగంగా గురుకుల పాఠశాలలో స్థాపించిందని తెలిపారు. పారిశ్రామిక అభివృద్ధి జరిగితే ఉద్యోగాలు ఎక్కువగా లభిస్తాయని, అలాంటి విద్యా విధానం అమలు కావాలని సూచించారు. ఉపాధ్యాయుల కృషితోనే విద్య విధానంలో మార్పులు వస్తాయని, నాణ్యమైన విద్య లభిస్తుందని తెలిపారు. టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు సిహెచ్ రాములు మాట్లాడుతూ రాష్ట్రంలో ఖాళీగా ఉన్న పర్యవేక్షణ అధికారి పోస్టులు భర్తీ చేయాలని, ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించాలని, బదిలీలు చేపట్టాలని ప్రభుత్వాన్ని సూచించారు. స్వచ్ఛ కార్మికులను నియమించాలని, కేజీబీవీ మరియు మోడల్ స్కూల్ ఉపాధ్యాయుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
అనంతరం జరిగిన విద్యా-సదస్సుకు టీఎస్ యుటిఎఫ్ జిల్లా కార్యదర్శి ఆర్ రవీందర్ అధ్యక్షత వహించగా విద్యా సదస్సులో డాక్టర్ అందే. సత్యం సామాజిక ఆర్థిక విశ్లేషకులు. ‘ భారత ఆర్థిక వ్యవస్థ పయనం ఎటువైపు? అనే అంశంపై మరియు ఉపాధ్యాయ నియోజకవర్గ ఎమ్మెల్సీ అలుగుబెల్లి. నర్సిరెడ్డి ‘నూతన జాతీయ విద్యా విధానం 2020’ అనే అంశంపై సందేశాన్ని ఇచ్చారు. మహా సభల సందర్భంగా జాతీయ పతాకం ,ఎస్టిఎఫ్ఐ, టిఎస్ యుటిఎఫ్ పతాకాలను సీనియర్ నాయకులు జిలకర రామస్వామి ,గుండా బిక్షపతి, ఆర్ రాములు ఆవిష్కరించారు.ఈ మహాసభలో టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ఎం. రాజశేఖర్ రెడ్డి, జి. నాగమణి ,నేరేడుచర్ల మున్సిపాలిటీ చైర్మన్ చందమల్ల జయ బాబు, వైస్ చైర్ పర్సన్ చల్లా శ్రీలత రెడ్డి, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కొలిశెట్టి యాదగిరిరావు, నల్లగొండ టీఎస్ యుటిఎఫ్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఎడ్ల. సైదులు, పి. వెంకటేశం ,వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కొదమగుండ్ల .నగేష్ టిఎస్ యుటిఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ సోమయ్య, ఆహ్వాన సంఘం అధ్యక్షుడు నాగండ్ల నరసింహారావు , కోశాధికారి నల్లపు సాంబయ్య, టీఎస్ యుటిఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు పి శ్రీనివాస్ రెడ్డి, రైతు సంఘం జిల్లా నాయకులు పారుపల్లి శేఖర్ రావు, టీఎస్ యుటీఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు కే అరుణ భారతి , జిల్లా కోశాధికారి జి వెంకటయ్య, రాష్ట్ర ఆడిట్ కమిటీ సభ్యుడు జే. యాకయ్య , రాష్ట్ర కమిటీ సభ్యుడు ఎస్కే సయ్యద్, పౌర స్పందన వేదిక జిల్లా అధ్యక్షుడు ఆర్ ధనమూర్తి , ఎం.ఎస్.టి.ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు క్రాంతికుమార్, మండల విద్యాధికారి పానుగంటి ఛత్రు నాయక్ , నేరేడుచర్ల మున్సిపాలిటీ ఐదో వార్డ్ కౌన్సిలర్ అలక సరిత , 8వ వార్డు కౌన్సిలర్ కొదమగుండ్ల సరిత , జిల్లా ఆఫీస్ బేరర్స్ మరియు 23 మండలాల అధ్యక్ష కార్యదర్శులు , సీనియర్ నాయకులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.