రిపబ్లిక్ హిందుస్థాన్, పాలకవీడు
బైకు అదుపుతప్పి పంట పొలాల్లోకి దూసుకు వెళ్లిన ఘటనలో ఓ యువకుడు మృతి చెందాడు. ఈ ఘటన సూర్యాపేట జిల్లా పాలకవీడు మండలం బెట్టగూడెం గ్రామ శివారులో గురువారం రాత్రి చోటుచేసుకుంది. స్థానికులు గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం పాలకవీడు మండలం సోనియా పహాడ్ గ్రామానికి చెందిన రమావత్ తరుణ్ (18) జెసిబి డ్రైవర్గా నేరేడుచర్ల లో పనిచేస్తున్నాడు. గురువారం సాయంత్రం తన వ్యక్తిగత పనుల మీద నేరేడుచర్ల వెళ్లి తిరిగి గురువారం రాత్రి పనులు ముగించుకొని సూర్యపాడు వెళ్తుండగా నేరేడుచర్ల నుండి దామరచర్ల వెళ్లే ప్రధాన రహదారి బెట్టగూడెం గ్రామ శివారులోని మూలమలుపు వద్ద మోటార్ సైకిల్ పంటపొలాల్లోకి దూసుకెళ్లి అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికులు శుక్రవారం ఉదయం ప్రమాదాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని బయటకు తీసి శూన్య పహాడ్ కు చెందిన రామావత్ తరుణ్ గా గుర్తించారు. కాగా తరుణ్ తండ్రి రవి శూన్య పహాడ్ గ్రామపంచాయతీ సిబ్బందిగా పనులు నిర్వహిస్తున్నాడు చేతికి అందిన కొడుకు మృతితో ఆ కుటుంబం లో విషాదఛాయలు నెలకొన్నాయి.
బైక్ అదుపుతప్పి యువకుడు మృతి
RELATED ARTICLES
Recent Comments
Hello world!
on