“విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పాల్సిన కొంతమంది ఉపాధ్యాయులు గాడి తప్పుతున్నారు. విద్యార్థులను భావి భారత పౌరులుగా తీర్చిదిద్దాల్సిన అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతున్నారు. తాజాగా తెలంగాణలోని నిజామాబాద్ జిల్లాలో ఓ పాఠశాలలో జరిగిన కీచక ఉపాద్యాయుడి ఘటన మరువక ముందే కేరళలో అలాంటి ఘటనే పునరావృతం అయింది.”
రిపబ్లిక్ హిందుస్థాన్, వెబ్ డెస్క్ :
కేరళ లో దారుణమైన ఘటన చోటుచేసుకుంది. విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఓ ఉపాధ్యాయుడు పాఠశాలలోని విద్యార్థినిల పట్ల పశువుల ప్రవర్తించాడు. కామంతో కళ్లు మూసుకుపోయిన సదరు పశువుకు వయస్సు 52 ఏళ్ళు, పేరు ఫైజాన్.
కేరళలో ని కన్నూర్ జల్లాలోని తలిపరంభ పోలీస్ స్టేషన్ లో పరిధిలో చోటుచేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
ఆ మృగాడి పేరు ఫైజాన్ అని అతడు మలప్పురం జిల్లాలోని కొండొట్టీలో నివసిస్తుంటాడని పోలీసులు చెప్పారు. అతడిని అరెస్టు చేశామని, 14 రోజుల పోలీసు కస్టడీలో ఉన్నాడని పోలీసులు వివరించారు. ఉపాధ్యాయుడు తమను లైంగికంగా వేధిస్తున్నాడని విద్యార్థినులు ఫిర్యాదు చేయడంతో అతడిపై చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.
చిన్నారులపై లైంగికదాడుల నిరోధక చట్టం (పోక్సో)లోని 7,8,9,10 సెక్షన్లతో పాటు, ఐపీసీ సెక్షన్ 354 కింద ఆ మృగాడిపై కేసులు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. ఆరు, ఏడో తరగతికి చెందిన ఐదుగురు విద్యార్థుల నుంచి వివరాలు తీసుకున్నామని చెప్పారు.
మరి కొంతమంది విద్యార్థుల నుంచి స్టేట్ మెంట్ తీసుకుంటామని తెలిపారు. పాఠశాలలో కౌన్సెలింగ్ నిర్వహిస్తున్న వేళ 20 మంది విద్యార్థినులు తమపై జరిగిన లైంగిక వేధింపుల గురించి బడి అధికారులకు వివరించారని అన్నారు. అనంతరం ఆ అధికారులు పోలీసులకు దీనిపై సమాచారం అందించారని తెలిపారు.
మీ చుట్టూ అవినీతి అక్రమాలు , అసాంఘిక కార్యకలాపాలు జరిగితే రిపబ్లిక్ హిందుస్థాన్ మీడియాకి తెలపండి… 8985614333 వాట్సాప్ ద్వారా తెలియజేయండి. అవినీతి అక్రమాలు , సమాజాన్ని నష్ట పరిచే అసాంఘిక కార్యకలాపాలు పంపించే వారి వివరాలు గోప్యంగా ఉంచబడుతాయి… @republichindustannews