
రక్తహీనతతో బాధపడుతున్న పరమల్ల వాసికి ఓ పాజిటివ్ రక్తం అందజేత.
ఐవిఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్ మరియు రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలు…
నారద వర్తమాన సమాచారం కామారెడ్డి జిల్లా ప్రతినిధి:మే 20,
కామారెడ్డి జిల్లా లింగంపేట్ మండలం పరిమల్ల గ్రామానికి చెందిన రాములు పట్టణంలోని వేద గ్యాస్ట్రో వైద్యశాలలో రక్తహీనతతో బాధపడుతూ ఉండడంతో వారి కుటుంబ సభ్యులు ఐవిఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్,రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలు ను సంప్రదించడంతో కామారెడ్డి రక్తదాతల సమూహ సలహాదారులు ఎర్రం చంద్రశేఖర్ సహకారంతో అడ్లూరు గ్రామానికి చెందిన భార్గవ్ కు తెలియజేయడంతో వెంటనే స్పందించి కేబిఎస్ రక్తనిధి కేంద్రంలో రక్తదానం చేసి ప్రాణదాతగా నిలిచారు. రక్తదానానికి ముందుకు వచ్చిన రక్తదాత భార్గవ్ కు తెలంగాణ టూరిజం కార్పొరేషన్ పూర్వ చైర్మన్, ఐవిఎఫ్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా తరఫున అభినందనలు తెలియజేశారు. వేసవికాలం కావడం వలన రక్త నిల్వలు లేకపోవడంతో పేషెంట్లు తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కోవడం జరుగుతుందని రక్తదానానికి యువకులు ముందుకు రావాలని అన్నారు.