సౌదీ అరేబియా తెలుగు అసోసియేషన్ (SATA) – నార్త్ రీజియన్ తబుక్ లో నిర్వహించిన భోగి మరియు సంక్రాంతి “సరదాల సంక్రాంతి” కార్యక్రమం సభికులకు ఉత్తేజం ఉల్లాసం కలిగించింది.
గురువారం జనవరి 11 న రాత్రి 8 గంటలు మొదలైన ఈ సంబురాలు శుక్రవారం జనవరి 12 న సాయంత్రం 6 వరకు పండగ వాతావరణం తో అనేకమైన సాంప్రదాయ కార్యక్రమాలతో, ఆట పాటలతో మరియు వివిధ రకాల సాంస్కృతిక కార్యక్రమాలతో సభికులందరినీ ఎంతగానో అలరించింది.







పిల్లల నుండి వృద్ధుల వరకు అన్ని వయసుల వారికి ఎంతగానో ఇష్టమైన మన భోగి సంక్రాంతి పండగలో ముఖ్యమైన భోగి మంట, గొబ్బెమ్మ పూజ , చిన్న వయసు గల పిల్లలకు భోగి పళ్లతో పాటు అందరికీ సాంప్రదాయ ప్రకారం అరిటాకు భోజనం చాలా విశేషంగా ఆకట్టుకుంది.
పలు సంక్షృతిక కార్యక్రమాల్లో మగవారు చేసినటువంటి పంచకట్టుతో నడక, అలాగే సభ్యులు చేసిన నృత్య కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
కార్యక్రమం లో భాగంగా కమిటీ సభ్యులు మన SATA ముఖ్య ఉద్దేశం గురించి అందరికీ వివరించారు. మనం చేపట్టిన పలు విషయాలు సహకారాలు గురించి చిన్న చిత్రీకరణ కూడా చూపించడం విశేషం.
కార్యక్రమ నిర్వహణ లో భాగంగా SATA కమ్యూనిటీ సభ్యులకు అవార్డులు అందించారు. పలు కార్యక్రమాలు లో గెలిచిన వారికి బహుమతులు ఇచ్చారు. SATA వ్యవస్థాపక అధ్యక్షుడు మల్లేసన్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
టబుక్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మరియు దాని సభ్యుల జాబితా
ఎగ్జిక్యూటివ్ కమిటీ:
పరశురామ్ వర్మ బిజిలి
సూర్యనారాయణ పళ్ల
తిరుపత లొకోట
రమీజ్ రాజ
రోహన్ సన్నిధి
హరిప్రియ రోహన్
సతీష్ కుమార్ జల్లెపల్లి
అనూష సతీష్
నరేంద్ర పెల్లూరి
నరేష్
రిసెప్షన్ కమిటీ:
రోహన్ సన్నిధి
సతీష్ కుమార్ జల్లెపల్లి
ఆహార కమిటీ:
తిరుపతి లొకోట,
నరేష్
స్పోర్ట్స్ కమిటీ:
రమీజ్ రాజ,
అనూష సతీష్,
హరిప్రియ రోహన్,
సాంస్కృతిక కమిటీ:
హరిప్రియ రోహన్,
అనూష సతీష్
హాస్పిటాలిటీ కమిటీ:
పరశురామ్ వర్మ బిజిలి
స్టేజ్ కమిటీ:
సూర్యనారాయణ పళ్ల
ఆడియో విజువల్:
నరేంద్ర పెల్లూరి
ఆర్థిక మరియు కొనుగోల్లు:
SATA ఎగ్జిక్యూటివ్ సభ్యులు
ఈ కార్యక్రమానికి సౌదీ అరేబియాలోని జెడ్డా, నియామ్, టబుక్, దుబ, శర్మ, తమిమి మరియు ఇతర ప్రాంతాలతో పాటు వివిధ నగరాల నుండి ప్రజలు హాజరయ్యారు.
SATA నార్త్ రీజియన్ లో జరిగిన ఈ మొదటి పండగకు మల్లేష్ గారూ జెడ్డా నుండి వచ్చి పాల్గొనడం తబుక్ సభ్యులకు మరింత ఉత్సహం ఇచ్చిందని రీజియన్ ప్రెసిడెంట్ తిరుపతి గారు తెలియ చేశారు.
మున్ముందు జరుపాబోయే మరిన్ని పండగలకు కుటుంబ సమేతంగా వచ్చి సంబరాల్లో పాల్గొనాలని రీజియన్ ఉమెన్స్ వింగ్ ప్రెసిడెంట్ హరిప్రియ రోహిత్ పిలుపునిచ్చారు.