బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్ ఆధ్వర్యంలో, రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి సమక్షలో చేరికలు
నర్సంపేటలో బీఆర్ఎస్ పార్టీకి మరో ఎదురు దెబ్బతగిలింది.బీఆర్ఎస్ పార్టీకి చెందిన యువ నాయకుడు రాణా ప్రతాపరెడ్డి ఆ పార్టీకి, కన్వీనర్ పదవికి రాజీనామా చేశారు. అదేవిధంగా మున్సిపల్ చైర్మన్ పై సొంత పార్టీకి చెందిన కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. అనంతరం జరిగిన పరిణామాలతో పార్టీకి రాజీనామా చేశారు.

వారంతా శనివారం బీజేపీ వరంగల్ జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్ ఆధ్వర్యంలో , రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు. వీరితో పాటు నియోజవర్గ చెందిన పలువురు నాయకులు బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. బీజేపీ లో చేరినవారిలో గోగుల రాణా ప్రతాప్ రెడ్డి , ఏడో డివిజన్ కౌన్సిలర్ మినుముల రాజు, నాల్గో డివిజన్ కౌన్సిలర్ శీలం రాంబాబు, రెండో డివిజన్ కౌన్సిలర్ జుర్రు రాజు, మూడో డివిజన్ కౌన్సిలర్ బానవత్ కవిత-వీరన్న, 17వ డివిజన్ కౌన్సిలర్ బోడ గోల్యా నాయక్, తదితరులు వీరితో పాటు నియోజకవర్గానికి చెందిన పలువురు నాయకులు బీజేపీ లో చేరారు.