
నారద వర్తమాన సమాచారం
పల్నాడు జిల్లా పోలీస్,
తేదీ.05.6.2024.
కౌంటింగ్ సందర్భంగా ఫలితాలు వెలువడిన అనంతరం జిల్లాలో జరిగిన సంఘటనలపై నమోదైన కేసులను ప్రత్యక్షంగా సమీక్షించిన – పల్నాడు జిల్లా ఎస్పీ మల్లిక గర్గ్ ఐపీఎస్.
నిన్న అనగా 04.6.2024 వ తేదీ కౌంటింగ్ సందర్భంగా జిల్లాలో ఫలితాల అనంతరం జరిగిన సంఘటనలపై సత్వరమే స్పందించి వాటిపై తగిన సెక్షన్ల కింద కేసులు నమోదు చేశామని ఎస్పీ తెలిపారు.
ఈ రోజున ఏ ఏ స్టేషన్ల లో కేసులు నమోదు అయ్యాయో ఆ స్టేషన్లని ప్రత్యక్షంగా తనిఖీ చేసి సదరు కేసులను గురించి క్షుణ్ణంగా తెలుసుకొని దానిలో ఎవరెవరు ముద్దాయిలుగా ఉన్నారు, వాళ్ళల్లో ఎంతమంది అరెస్టయ్యారు, ఎంత మంది అరెస్టు కావాల్సి ఉంది, కేసులను ఏ విధంగా దర్యాప్తు చేయాలని దర్యాప్తు అధికారులకు తగిన సూచనలు ఇచ్చిన ఎస్పీ
అదేవిధంగా అటువంటి కేసులలో ఉన్నవారు నేరచరిత్ర కలవారు అయితే వారిపై రౌడీషీట్లు ఓపెన్ చేయమని కూడా పోలీసు అధికారులకు ఎస్పీ సూచించారు.
ఈ సందర్భంగా ఎస్పీ మీడియాతో మాట్లాడుతూ,నిన్న కౌంటింగ్ ప్రశాంత వాతావరణంలో విజయవంతంగా జరగడానికి సహకరించిన పల్నాడు జిల్లా ప్రజలు,ప్రజాప్రతినిధులు, మీడియా సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు.
అదేవిధంగా జిల్లాలో అక్కడక్కడ జరిగిన సంఘటనలపై మాట్లాడుతూ,
నిన్న జరిగిన ప్రతి సంఘటనపై కేసును నమోదు చేశామని ఆ కేసుల్లో ముద్దాయిలను వీలైనంత త్వరగా అరెస్టు చేసి జైలుకు పంపిస్తామని తెలియజేశారు, ఇంకా ఎవరైనా గొడవలు, అల్లర్లు చేయాలని చూస్తే వారిని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టమని హెచ్చరించారు.
అసాంఘిక కార్యకలాపాలు చేస్తూ,శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే ఎవరిని ఉపేక్షించేది లేదని అట్టి వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఎవరైనా ప్రభుత్వ ఆస్తులను, ప్రైవేటు ఆస్తులను ధ్వంసం చేసిన, వ్యక్తిగత దాడులకు పాల్పడిన అట్టి వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోబడతాయి.
అదేవిధంగా సోషల్ మీడియాలో విద్వేషాలు రెచ్చగొట్టే పోస్టులు పెట్టిన వాటిని ప్రచారం చేసిన అటువంటి వారిపై కూడా చట్ట ప్రకారం కేసులు నమోదు చేసి జైలుకి పంపించడం జరుగుతుంది.
నరసరావుపేట పట్టణంలో సమస్యత్మక గ్రామాలలో సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు,విలేజ్ క్లినిక్ ల వద్ద పోలీసు పికెట్స్ నడుస్తున్నాయి, ట్రబుల్ మాంగర్స్, రౌడీషీటర్ల మీద ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసివున్నామని ఎస్పీ తెలిపారు.
అదే విధంగా జిల్లాలో 144 సెక్షన్,30 పోలీస్ యాక్ట్ అమలులో ఉన్నాయని ఎవరు కూడా బయటకు రాకూడదని, బయట అనవసరంగా తిరిగితే అటువంటి వారిపై కేసులు నమోదు చేస్తామని ప్రజలంతా దీన్ని గమనించి నడుచుకోవాలని ఎస్పీ కోరారు.
పోలీసు వారు వెహికల్ చెకింగ్ చేయునప్పుడు వాహనదారులు కచ్చితంగా రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్,ఒరిజినల్ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలనీ, లేనియెడల వెహికల్ ని సీజ్ చేసి 102 సి ఆర్ పి సి కింద కేసు నమోదు చేయడం జరుగుతుందనీ తెలియజేశారు.
ఈ సందర్భంగా ఎస్పీ చిలకలూరిపేట నియోజవర్గంలోని ఎడ్లపాడు, నాదెండ్ల, వినుకొండ నియోజకవర్గం లోని వినుకొండ టౌన్, నరసరావుపేట నియోజకవర్గంలోని రొంపిచర్ల సత్తెనపల్లి నియోజకవర్గంలోని నకరికల్లు పోలీస్ స్టేషన్లను తనిఖీ చేసినారు.
జిల్లా పోలీసు కార్యాలయం,
పల్నాడు జిల్లా.