కొత్తవారికి అవకాశం ఇవ్వాలని మెజారిటీ ప్రజల అభిప్రాయం..
యువకులకు అవకాశం ఇస్తే అభివృద్ధి జరుగుతుందనీ నమ్ముతున్న జనం..
రాథోడ్ సుభాష్ కట్టర్ కాషాయ వాది కావడంతో కలిసివస్తున్న వైనం..
ఇచ్చోడ / ఆదిలాబాద్ / బోథ్ : ఆదిలాబాద్ పార్లమెంటు ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థి గా పోటీ చేస్తున్న రాథోడ్ సుభాష్ rathod Subash mp indipendent candidate Adilabad కు బోథ్ నియోజకవర్గంలో అనూహ్యంగా మద్దతు లభిస్తుంది. సిలిండర్ గుర్తు భారీ మెజారిటీతో గెలిచే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.





బోథ్ నుండి గెలిచి ఎం చేశారో తెలియని నాయకులు , ఐదేళ్ళు ఎక్కడ ఉంటారో కూడా ప్రజలకి తెలియని నాయకులు ఈ సారి అవసరం లేదని మెజారిటీ ప్రజలు అభిప్రాయ పడుతున్నారు. రాథోడ్ సుభాష్ కట్టర్ కాషాయ వాది కావడం కూడా కలిసి వస్తోంది. ఈ సందర్భంగా రాథోడ్ సుభాష్ మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రజల అభివృద్దే తన ధ్యేయమని అన్నారు. అదే విధంగా విద్యాలయాల మెరుగుపరచడం , రైతులకు నీటి సౌకర్యం కల్పించడం , అన్ని వర్గాల దేవ్వుల్లకు దేవాదాయ శాఖ ద్వారా వారి వారి ఆలయాలు నిర్మించి ఇస్తానని అన్నారు. కేంద్రంలో మోడీ సర్కార్ చేపట్టిన సబ్కా సాత్ సబ్కా వికాస్ నినాదంతో కలిసి పని చేస్తానని అన్నారు. బీజేపీ లో 25 ఏళ్లుగా పనిచేస్తున్నా నని అన్నారు. జెండా మోసి కష్టపడిన వారిని గుర్తించాలని ప్రజలను కోరారు. ఎప్పుడో జమానా కింద వేసిన రోడ్లు ఉన్నాయనీ వాటి విస్తరణ కోసం పని చేస్తానని అన్నారు. ఇచ్చోడ మండలంలోని సిరిచెల్మా మల్లికార్జున స్వామి పుణ్య క్షేత్రమునకు వెళ్లే రోడ్డు ను నాలుగా వరుసల రోడ్డు గా మారుస్తానని అన్నారు. అదే విధంగా ఇచ్చోడ నుండి ఖానాపూర్ కు రోడ్డు సౌకర్యం గెలిచిన రెండు నెలల్లో మంజూరు చేయించి రోడ్డు సౌకర్యం కల్పిస్తానని అన్నారు. బజార్ హాత్నూర్ మండలంలో గతంలో బురద మయం రోడ్డు ఉంటే ఒక బాలుడు అనారోగ్యంతో బాధపడుతూ రోడ్డు బాగా లేక పోవడంతో ఆసుపత్రికి సమయానికి వెళ్ళలేక ప్రాణాలు కోల్పోయిన బాలుడి వార్త తనను ఎంతో బాధ పెట్టిందని అన్నారు. ఇలాంటి ఎన్నో సంఘటనలు రోడ్లు లేక జరగడం అప్పటి నాయకులకు సిగ్గు చేటని అన్నారు.
డిజిటల్ యుగంలో కూడా ప్రజలు రోడ్లు , రైల్వే కోసం వేచి చూస్తున్నారని అన్నారు.
ఈ పరిస్థితుల్లో మార్పు రావాలంటే రైతు బిడ్డ గా మి ముందుకు వచ్చిన మి బీజేపీ మాజీ సర్పంచ్ రాథోడ్ సుభాష్ ను భారీ మెజారిటీతో గెలిపించి పార్లమెంటుకు పంపాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎల్ శేష రావ్ , బి గోవింద్ , సాయి కుమార్ , రాథోడ్ సంజీవ్ కుమార్ , అజ్జు జాదవ్ , తరుణ్ కుమార్ , గోరఖ్ నాథ్ , బాల కుంబవడ్ మరియు వివిధ గ్రామాల పెద్దలు ఉన్నారు.