Tuesday, April 8, 2025
Homeఆంధ్రప్రదేశ్నాగార్జునసాగర్ అంతర్రాష్ట్ర చెక్ పోస్ట్ వద్ద తనిఖీలలో పట్టుబడ్డ 32 కేజీల గంజాయి…

నాగార్జునసాగర్ అంతర్రాష్ట్ర చెక్ పోస్ట్ వద్ద తనిఖీలలో పట్టుబడ్డ 32 కేజీల గంజాయి…

నారద వర్తమాన సమాచారం

జూన్ :14

పల్నాడు జిల్లా మాచర్ల….

నాగార్జునసాగర్ అంతర్రాష్ట్ర చెక్పోస్ట్ వద్ద తనిఖీలలో పట్టుబడ్డ 32 కేజీల గంజాయి…

ఈ సందర్భంగా మాచర్ల రూరల్ సిఐ సురేష్ నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ…

నాగార్జునసాగర్ చెక్పోస్ట్ వద్ద సాధారణ వాహన తనిఖీలు చేస్తుండగా ఓ కారులో గంజాయి ఉన్నట్లుగా ముందస్తు సమాచారం అందడంతో ఆ కారును అదుపులో తీసుకున్నారు….

కారులో ప్రయాణిస్తున్న మడకం రాంబాబు, బురగా రాజేశ్వరి, చోళంగి చంద్రశేఖర్ అను ముగ్గురు అల్లూరు సీతారామరాజు జిల్లా రంపచోడవరం నుండి ఈ గంజాయి మొత్తాన్ని చిత్తూరు జిల్లా మదనపల్లికి తరలించేందుకు వెళుతుండగా పట్టుబడ్డారు…..

పట్టుపడ్డ గంజాయి విలువ సుమారు మూడు లక్షలు 20,000 ఉంటుందని సీఐ సురేష్ తెలిపారు….

ఈ సంఘటనలో పట్టుబడ్డ నిందితులను, గంజాయిని , వాహనాన్ని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి కోర్టులో హాజరు పరచనున్నట్లు సిఐ తెలిపారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Need Help?