నారద వర్తమాన సమాచారం
బాపట్ల జిల్లాలో హత్య గావింపబడిన యువతి గుర్తింపు…సంఘటన స్థలాన్ని పరిశీలించిన..హోమ్ మినిష్టర్.. అనిత
బాపట్ల
జూన్ :21
బాపట్ల జిల్లా చీరాల మండలం ఈపురుపాలెం గ్రామంలో శుక్రవారం హత్యగావింపబడిన యువతిని పోలీసులు గుర్తించారు. డీఎస్పీ ప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం ఈపురుపాలెం సీతారామపేట కు సుచరిత(21) గుర్తించారు. ఉదయం బహిర్భూమికి వెళితే గుర్తుతెలియని వ్యక్తులు అత్యాచారం చేసి అనంతరం హత్య చేసినట్లు తెలిపారు. డాగ్ స్క్వాడ్ రంగంలోకి దింపినట్లు డిఎస్పి ప్రసాద్ మీడియా తెలిపారు…అయితే ఈ రోజు ఏపీ హోమ్ మినిస్టర్ అనిత తానే సంఘటన స్థలాన్ని పరిశీలించి అధికారులు ను వివరాలు అడిగి తెలుసుకున్నారు.. నిందులు ఎవరైనా సరే ఉపేక్షించబోమని ..తక్షణమే పోలీసు యంత్రాంగం ఈ కేసు పై విచారణ వేగవంతం చేయాలని ఆమె తెలిపారు.