రిపబ్లిక్ హిందుస్థాన్, ఆదిలాబాద్ : గురువారం సాయంత్రం స్థానిక ఏరోడ్రం పరిసర ప్రాంతం, అనుకుంటా గ్రామ శివారు నందు పేకాట ఆడుతున్నట్టు వచ్చిన విశ్వసనీయ సమాచారం రావడం తో స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ జె కృష్ణమూర్తి మరియు సిసిఎస్ ఇన్స్పెక్టర్ ఈ చంద్రమౌళి సంయుక్తంగా కలిసి దాడి చేయగా సంఘటనా స్థలంలో ఏడుగురు నిందితులు పట్టుబడ్డారు. పట్టుబడ్డ నిందితుల వివరాలు
1) ఎస్కే ఫెరోజ్
2) ఎండి ఫెరోజ్
3) జుబేర్ సోహెల్
4) అజీమ్ ఖాన్
5) ఎండి ముక్తార్
6) జహీర్ ఖాన్
7) జి శంకర్ లు పేకాట ఆడుతూ పట్టుబడ్డారు.
వీరందరూ ఆదిలాబాద్ పట్టణానికి చెందిన వారని, వీరి వద్దనుండి పేకాట ముక్కలు మరియు ఇరవై వేల రూపాయల నగదు స్వాధీనం చేసుకుని వీరిపై ఆదిలాబాద్ గ్రామీణ పోలీస్ స్టేషన్ నందు కేసు నమోదు చేసినట్లు సిఐ తెలిపారు. ఈ ఆపరేషన్ లో స్పెషల్ బ్రాంచ్ కానిస్టేబుల్ ఇసాక్, సిసిఎస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
ఏడుగురు పేకాట రాయుళ్ల అరెస్ట్
RELATED ARTICLES
Recent Comments
Hello world!
on