*రూ.43,100/- నగదు, ఐదు మొబైల్ ఫోన్లు, పేకాట ముక్కలు స్వాధీనం*
*మంగళవారం అర్ధరాత్రి సిసిఎస్ పోలీసులు నిర్వహించిన స్పెషల్ ఆపరేషన్
*ఉట్నూర్ పోలీస్ స్టేషన్ నందు కేసు నమోదు
– సిసిఎస్ ఇన్స్పెక్టర్ ఈ చంద్రమౌళి
రిపబ్లిక్ హిందుస్థాన్, ఉట్నూర్ :
మంగళవారం అర్ధరాత్రి సుమారు 11 గంటల సమయంలో ఉట్నూర్ మండలం షాంపూర్ గ్రామ శివారుల నందు జిల్లా ఎస్పీ డి ఉదయ్ కుమార్ రెడ్డి కి పేకాట ఆడుతున్నారని వచ్చిన విశ్వసనీయ సమాచారం మేరకు సిసిఎస్ ఇన్స్పెక్టర్ ఈ చంద్రమౌళి ఆధ్వర్యంలోని బృందం చాకచక్యంగా పొలాల నందు పేకాట ఆడుతున్నటువంటి ఆరుగురు నిందితులను సంఘటన స్థలంలో అరెస్టు చేశారు. నిందితుల వద్ద నుండి ఐదు మొబైల్ ఫోన్లు, రూ 43,150/- నగదు, పేకాట ముక్కలు స్వాధీనం చేసుకుని ఉట్నూర్ పోలీస్ స్టేషన్ నందు కేసు నమోదు పై అందజేసినట్లు తెలియజేశారు. నిందితులపై ఉట్నూర్ పోలీస్ స్టేషన్ నందు 44/2023 క్రైమ్ నెంబర్ తో 9(i) టీఎస్ గేమింగ్ యాక్ట్ ప్రకారం కేసు నమోదు చేసినట్లు తెలియజేశారు. నిందితుల వివరాలు
1) సొంకటే శ్రీరామ్
2) గిరి జ్ఞానేశ్వర్
3) సూర్య వంశీ రవి
4) దౌలే లక్ష్మణ్
5) గుప్త మనోజ్
6) దుంగే రిజ్వాన్
వీరిని సంఘటనా స్థలంలో అరెస్టు చేశారు. వీరందరూ ఉట్నూర్, ఇంద్రవెల్లి మండలాలకు సంబంధించిన వారిని తెలియజేశారు. ఈ ఆపరేషన్ లో సిసిఎస్ సిబ్బంది పాల్గొన్నారు.
