Tuesday, April 8, 2025
Homeవైరల్ వీడియోలు31 కోట్ల విలువైన ఇల్లు.. కేవలం 1000 రూపాయలకే..

31 కోట్ల విలువైన ఇల్లు.. కేవలం 1000 రూపాయలకే..

ఏ వ్యక్తికైనా ఇల్లు కట్టుకోవడం జీవిత ఆశయంగా పెట్టుకుంటారు. తమ సంపాదనతో చిన్న ఇల్లు కట్టుకుని సంతోషంగా జీవించాలనుకుంటారు. అయినా చాలామంది ఆ కలను నెరవేర్చుకోలేకపోతున్నారు.

దీనికి ద్రవ్యోల్బణం కూడా ఒక కారణం. నిజానికి నేటి కాలంలో పెరుగుతున్న ఆస్తుల ధరలకు సొంత ఇల్లు తీసుకోలేకపోతారు. అయితే కేవలం వెయ్యి రూపాయలకే బంగ్లాను కొనుగోలు చేయవచ్చు అన్న విషయం మీకు తెలిస్తే షాక్ అవ్వక తప్పదు. మరి ఆ ఇంటి వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

ఆంగ్ల వెబ్‌సైట్ ది సన్‌లో ప్రచురించిన నివేదిక ప్రకారం బంగ్లా బ్రిటన్‌లోని సెయింట్ ఆగ్నెస్ బీచ్‌కు కొద్ది దూరంలో ఓ బంగ్లా ఉంది ? ఆ ఇంటిలో అన్ని సౌకర్యాలు ఉన్నాయి. మరి ఆ ఇల్లు ఇంత చౌకగా ఎందుకు దొరుకుతుంది అనే ప్రశ్న మీ మదిలో మెదులుతూ ఉంటుంది. నిజానికి ఈ ఇంటిని ఓమాజ్ మిలియన్ పౌండ్ హౌస్ డ్రా ద్వారా తీసుకోవచ్చు.

ఈ ఇల్లు ఎందుకు అంత ఖరీదైనది ?

ఓ లక్కీ డ్రాలో గెలిచిన వ్యక్తికి అన్ని సౌకర్యాలు ఉన్న బంగ్లాను ఇవ్వనున్నారు. ప్రముఖ నటుడు అలిస్టర్ మెక్‌గోవన్ కూడా ఈ డ్రాను ప్రమోట్ చేస్తున్నారు. ఈ డ్రాలో వచ్చే డబ్బును ప్రసిద్ధ NGO WWF కి ఇవ్వబడుతుంది. అంతరించిపోతున్న జాతుల పరిరక్షణ, వాటి ఆవాసాల రక్షణ, అడవుల రక్షణ వంటి అంశాల పై ఇది పనిచేస్తుంది.

ఈ ఇంటికి లోపల గదులు, బయట పార్కింగ్, అందమైన ప్రాంగణాన్ని డిజైన్ చేశారు. దీనితో పాటు ఒక గార్డెన్ ఏర్పాటు చేశారు. ఈ ఇంట్లో రెండు డబుల్ బెడ్‌రూమ్‌లు, గ్రౌండ్ ఫ్లోర్‌లో ఫ్రీ-స్టాండింగ్ బాత్రూమ్ ఉన్నాయి. దీనితో పాటు పెద్ద షవర్ రూమ్ ఉంది. ఈ బంగ్లా అసలు ధర 31 కోట్లు కాగా లక్కీ డ్రాలో 1000 రూపాయలకే గెలుచుకునే అవకాశం ఉంది. ఈ ఇంటిని అద్దెకు పెడితే నెలకు మూడు లక్షల రూపాయల అద్దె వస్తుంది. మరి ఇంకెందుకు ఆలస్యం ఇప్పుడే మీ అదృష్టాన్ని పరీక్షించుకోండి.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Need Help?