ఆకలి మనిషిని ఎంత దూరం తీసుకువెళుతుందో చెప్పడానికి ఉత్తర కేరళలోని కుట్టిప్పురంలో ఘటనే తాజా ఉదాహరణ. ఇక్కడ బస్ స్టేషన్‌లో ఓ విద్యార్థి చనిపోయిన పిల్లి పచ్చి మాంసం తింటున్నాడు.
ఈ ఘటనను చూసిన జనం ఒక్కసారి షాక్ అయ్యారు. అస్సాంకు చెందిన ఓ విద్యార్థి రోజుల తరబడి ఆహారం లేక పిల్లి పచ్చిమాంసాన్ని తినడం కనిపించింది. రద్దీగా ఉండే బస్టాండ్ లో కూర్చుని పిల్లి మాంసాన్ని తినడం అక్కడి జనాలు గమనించారు. ఆ విద్యార్థిని అస్సాం రాష్ట్రానికి చెందిన వాడుగా గుర్తించాడు.
బస్టాండ్ మెట్లపై కూర్చని పిల్లిమాంసం తింటున్నట్లు స్థానికులు గమనించారని..ఓ పోలీస్ అధికారి తెలిపారు. సమాచారం అందుకున్న తర్వాత ఘటన స్థలానికి చేరుకుని అతన్ని విచారిస్తే గత ఐదు రోజులుగా ఎలాంటి ఆహారం తినలేదని..చెప్పినట్లు పోలీసులు తెలిపారు. సదరు వ్యక్తి అస్సాంలోని ఓ కళాశాల విద్యార్థిగా గుర్తించారు. ఇంట్లో చెప్పకుండా ట్రైన్ ఎక్కి డిసెంబర్ లో కేరళకు వచ్చాడని తెలిసింది. విచారణలో చెన్నైలో పనిచేస్తున్న అతని సోదరుడి మొబైల్ నెంబర్ ఇచ్చినట్లు ..అతన్ని సంప్రదించి వివరాలు ధ్రువీకరించినట్లు పోలీసులు తెలిపారు. ప్రాథమిక వైద్య పరీక్షల అనంతరం యువకుడిని త్రిసూర్‌లోని ఓ ఆసుపత్రిలో చేర్చారు. యువకుడికి శారీరక, మానసిక సమస్యలు లేవని, కుటుంబ సభ్యులు ఇక్కడికి రాగానే వారికి అప్పగిస్తామని పోలీసులు తెలిపారు.