రిపబ్లిక్ హిందుస్థాన్, నల్లబెల్లి: నల్లబెల్లి మండలంలోని నందిగామ గ్రామానికి చెందిన యువకుడు నాగుల గాని దీక్షిత్ హనుమకొండలో విద్యను అభ్యసిస్తున్నాడు. ఉదయం ద్విచక్ర వాహనంపై కళాశాలకు వెళ్తుండగా ఎదురుగా వస్తున్న టాటా ఏస్ వాహనం ఢీకొట్టడంతో దీక్షిత్ కు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు స్పందించి ఆసుపత్రికి తరలించిన ఫలితం, అప్పటికే దీక్షిత్ మృతి చెందాడు. అతనితో ప్రయాణిస్తున్న స్నేహితునికి గాయాలయ్యాయి. దీక్షిత్ మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. చేతికి అందాల్సిన కొడుకు మృతి చెందడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నిరుగా విలపిస్తున్నారు.
రోడ్డు ప్రమాదంలో విద్యార్థి మృతి
RELATED ARTICLES
Recent Comments
Hello world!
on