రిపబ్లిక్ హిందూస్ధాన్,ఆదిలాబాద్ అర్బన్ : కేంద్ర ప్రభుత్వ ప్రజా, రైతు, కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈ రోజు మధ్యాహ్నం భోజన విరామ సమయంలో భారతీయ జీవిత భీమా సంస్థ (ఎల్.ఐ.సి) శాఖ ఆదిలాబాద్ కార్యాలయం ముందు నినాదాలతో ఉద్యోగులు, అధికారులు, ఏజెంట్లు, నిరసన ప్రదర్శన చేశారు. ఈ సందర్భంగా ఎ. ఐ. ఐ. ఇ. ఏ. ఆదిలాబాద్ బ్రాంచ్ కార్యదర్శి కోవ దౌలత్ రావు మోకాశి మాట్లాడుతూ మూడు రైతు వ్యతిరేక నల్ల చట్టాల రద్దుకు రైతులు చేసిన పోరాట విధానంను ఆయన కోనియాడరు. వారికి జీవిత భీమా ఉద్యోగుల సంఘం, ఏంజేట్ల సంఘం తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఆదే స్పూర్తితో భీమా రంగ సంస్థను కాపాడటానికి అందరు ఐక్యంగా ఉండి ఉద్యమించాలని ఆయన పిలుపునిచ్చారు.భీమా రంగంలో ప్రభుత్వ వాటాను తగ్గించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న ట్లు ఆయన తెలిపినారు. ఎల్.ఐ.సి.లో ఐ.పి.వో. నిర్ణయాన్ని ప్రభుత్వం వేంటనే వెనక్కి తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. రైతుల డిమాండ్లను వేంటనే ఆమోదించి కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలని,రైతులపై పెట్టిన అక్రమ కేసులను వేంటనే ఉప సంహరించాలని, రైతు ఉద్యమంలో మరణించిన రైతు కుటుంబలకు తగిన నష్ట పరిహరం వేంటనే చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో భీమా ఉద్యోగుల సంఘం ఆధ్యక్షులు జి.గణేష్, అధికారుల సంఘం ఆధ్యక్షులు జి. కృష్ణా, ఏంజేట్ల సంఘం ఆధ్యక్షులు రామచంద్ర రెడ్డి, వికాశాఖకారుల సంఘం నాయకులు భాస్కర్, సుమాన్,మరియు ఉద్యోగులు గోవర్ధన్, స్వామి,శ్రీరాం, ఫయిమ్ సిద్దిక్, సాయి, శ్రీనాథ్, నీలానంద్, జగదీష్, రమేష్, రాజ్ కుమార్, ఎజేంట్లు నర్సింగ్, దేవిదాస్, రాములు, తదితరులు పాల్గొన్నారు.
రైతు ఉద్యమ స్ఫూర్తితో ఎల్ఐసిని కాపాడుకుందాం
Recent Comments
Hello world!
on