రిపబ్లిక్ హిందుస్థాన్, ఆదిలాబాద్ :
శనివారం స్థానిక ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్ నందు నూతనంగా ఆదిలాబాద్ ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్ కి సాధారణ బదిలీల్లో భాగంగా బదిలీ అయి, ఒకటవ పట్టణ సీఐ కటకం సత్యనారాయణ శనివారం రోజు బాధ్యతలు స్వీకరించారు. 2009 సంవత్సరానికి ఎస్సైగా పోలీస్ డిపార్ట్మెంట్ లోకి అడుగుపెట్టి అంచలంచలుగా ఎదిగి, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఉట్నూరు లో మొదటి పోస్టింగా బాధ్యతలు నిర్వర్తించి 2020 సంవత్సరంలో సీఐగా పదోన్నతి పొంది, ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ లో రెండు సంవత్సరాలు విజయవంతంగా విధులు పూర్తిచేసి, నూతనంగా ఆదిలాబాద్ ఒకటవ పట్టణ పోలీస్ స్టేషన్ కి బదిలీ అయి ఇకనుండి ఇక్కడ విధులు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ పట్టణంలోని శాంతిభద్రతల పై, అసాంఘిక కార్యకలాపాలు పై, పట్టణంలోని ట్రాఫిక్ పై ప్రత్యేక శ్రద్ధ తో దృష్టి సారించి వాటిని పరిష్కరించే దిశగా కృషి చేస్తానని తెలియజేశారు.
ఆదిలాబాద్ వన్ టౌన్ సీఐ గా బాధ్యతలు స్వీకరించిన కటకం సత్యనారాయణ

ఆదిలాబాద్ వన్ టౌన్ సీఐ గా బాధ్యతలు స్వీకరిస్తున్న కటకం సత్యనారాయణ