*జనవరి 22 రోజున శ్రీరామ ర్యాలీ సందర్భంగా ప్రధాన కూడల్ల లో ట్రాఫిక్ డైవర్షన్
*వినాయక చౌక్, దేవి చెంచు చౌక్, గాంధీచౌక్, అంబేద్కర్ చౌక్, నేతాజీ చౌక్ లనందు ట్రాఫిక్ నిబంధనలు.
*ప్రజలు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని పిలుపు.
*ప్రధాన కూడళ్లకు బదులుగా పాత జాతీయ రహదారిని, పట్టణంలోని అంతర్గత రోడ్లను వినియోగించుకోవాలి.
రిపబ్లిక్ హిందుస్థాన్, ఆదిలాబాద్:
శ్రీరామ ప్రాణ ప్రతిష్ట జనవరి 22 రోజున ఆదిలాబాద్ పట్టణంలో సాయంత్రం నిర్వహించే రామ ర్యాలీ సందర్భంగా ప్రజలందరికీ ప్రధాన కూడలి నందు ట్రాఫిక్ నియమాలను పాటించాలని జిల్లా ఎస్పీ గౌష్ ఆలం పిలుపునిచ్చారు.

జనవరి 22 సాయంత్రం స్థానిక వినాయక చౌక్, దేవిచంద్ చౌక్ గాంధీ చౌక్ అంబేద్కర్ చౌక్ నేతాజీ చౌక్ నందు ప్రజలు వాహనాలతో రాకుండా ఉండాలని వారి అవసరాలకు పాత జాతీయ రహదారిని ఆదిలాబాద్ పట్టణంలోని అంతర్గత రోడ్లను వినియోగించుకోవాలని తెలిపారు. పట్టణంలో ర్యాలీ రూట్ మొత్తాన్ని జిల్లా ఎస్పీ ఆదిలాబాద్ డిఎస్పి పోతారం శ్రీనివాస్, ఒకటవ పట్టణ సీఐ, ట్రాఫిక్ సీఐ, రెండవ పట్టణ సీఐ, సిబ్బందితో ర్యాలీ తిరుగు ప్రదేశాలని సందర్శించి సిబ్బందికి తగు సూచనలు చేశారు. ప్రశాంతంగా రామ ర్యాలీని నిర్వహించడానికి సరైన బందోబస్తును ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్పీ తెలిపారు. ఈ కార్యక్రమంలో సిఐలు కే సత్యనారాయణ కే అశోక్ కుమార్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.