Saturday, April 19, 2025
Homeతెలంగాణఆదిలాబాద్కోలాం గిరిజనులు విద్యపై దృష్టి సారించి ఉన్నత స్థానాలకు ఎదగాలి

కోలాం గిరిజనులు విద్యపై దృష్టి సారించి ఉన్నత స్థానాలకు ఎదగాలి

– జిల్లా ఎస్పీ గౌష్ ఆలం

🌐 ప్రభుత్వ పథకాలను విరివిగా వినియోగించుకొవాలి
🌐 తల్లిదండ్రులు పిల్లలకు చదువుపై ఆసక్తి కలిగేలా పాఠశాలలకు పంపించాలి...
🌐 గిరిజన సాంప్రదాయ పద్ధతులలో జిల్లా ఎస్పీకి ఘనంగా స్వాగతం..
🌐 ఇంద్రవెల్లి మండలం పాటగూడ గ్రామంలో ఉచిత బ్లాంకెట్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా ఎస్పీ...

రిపబ్లిక్ హిందుస్థాన్, ఆదిలాబాద్ :

పోలీసులు జిల్లా ప్రజలకు చేరువయ్యే కార్యక్రమాలలో భాగంగా కోలం గిరిజనులకు ఉచితంగా బ్లాంకెట్లు పంపిణీ చేయాలనే ఉద్దేశంతో 300 బ్లాంకెట్లను నిరుపేద ఆదివాసి కొలాం గిరిజనులకు జిల్లా ఎస్పీ గౌష్ ఆలం  అందజేశారు.

కార్యక్రమంలో మాట్లాడుతున్న జిల్లా ఎస్పి గౌస్ ఆలం

ఈ సందర్భంగా గ్రామ ప్రజలు మొదటిసారిగా గ్రామానికి నూతనంగా జిల్లా కు వచ్చిన ఎస్పీకి సాంప్రదాయ గిరిజన సాంస్కృతిక పద్ధతులలో ఘనంగా స్వాగతం పలికి, శాలువా పూలమాలతో సత్కరించడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ కొలాం గిరిజన విద్యార్థులు విద్యపై దృష్టి సారించాలని, ప్రభుత్వ ఉద్యోగాలను సాధించే విధంగా విద్యనాభ్యసించాలని సూచించారు. తమ వంతు కృషిగా ప్రభుత్వ నోటిఫికేషన్ వచ్చినప్పుడు ఉచితంగా శిక్షణను, పోలీసుల ద్వారా సలహాలను సూచనలను అందిస్తామని తెలిపారు. తల్లిదండ్రులు ముఖ్యంగా చిన్నప్పటినుండే పిల్లలకు చదువుపై ఆసక్తి కలిగేలా వ్యవహరించి పాఠశాలలకు వెళ్లేలా ప్రోత్సహించాలని సూచించారు.

యువత విద్యార్థులు కష్టపడి చదివి  ఉన్నత ప్రభుత్వ అధికారులుగా ఎదగాలని సూచించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా అవలంబిస్తున్న పథకాలను వినియోగించుకోవాలని సూచించారు. అభివృద్ధికి ముఖ్యంగా విద్య ఎంతగానో దోహదపడుతుందని ప్రతి ఒక్కరూ విద్యపై దృష్టి సారించి ఉన్నత విద్యను అభ్యసించేలా చూడాలని తెలిపారు.

తమ యొక్క భాష సాంప్రదాయం పద్ధతులు తనకి ఎంతగానో నచ్చాయని జిల్లా ఎస్పీ తెలిపారు. అనంతరం గిరిజనులతో కలిసి సామూహికంగా భోజన కార్యక్రమంలో పాల్గొని వారి ఆతిథ్యాన్ని స్వీకరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉట్నూర్ డిఎస్పీ సిహెచ్ నాగేందర్, సీఐ రామకృష్ణ, ఎస్సై సునీల్, గ్రామ సర్పంచ్, ఎంపీటీసీ, ప్రజలు, గ్రామ పెద్దలు, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Need Help?