ఆదివాసి సేన ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షులు రాయిసిడం జంగు పటేల్
రిపబ్లిక్ హిందూస్థాన్ , గూడిహత్నూర్:
ప్రశాంత వాతావరణంలో – 144 సెక్షన్ నడుమన ఎన్నికలు జరుగుతున్న రోజున కుంరం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని జైనూర్ మండల కేంద్రంలో ఆదివాసీ యువకుడి మర్సకోల లక్ష్మన్ పై కొందరు అల్లరి ముకలు, అసాంఘిక శక్తులు దాడికి పాల్పడిన నేటికీ వారి పైన చర్యలు తీసుకోకపోవడం పూర్తిగా అధికారుల నిర్లక్ష్యంతో పాటు, ఆదివాసుల పట్ల పూర్తి వివక్షత గా అధికారులు , ప్రభుత్వం వ్యవహరిస్తూన్నాయని.. గత కొన్ని సంవత్సరాలు షెడ్యూల్ ప్రాంత చట్టాలను ఉల్లంఘన అవుతుందని, చట్టాలనూ అమలు చేయమని అధికారులను కోరినప్పుడు.. గిరిజనేతరుల పట్ల మానవతా దృక్పథంతో వదిలేయమని సలహాలు ఇస్తున్న అధికారులు.. ఇప్పుడు.. అల్లరి ముకలు, అసాంఘిక శక్తులు.. ఆదివాసీ యువకుడి పై దాడులు చేస్తుంటే ఎందుకు నోరు మెదపడం లేదని ఆదివాసీ సేన ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షులు రాయిసిడం జంగు పటేల్ కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలను ప్రశ్నించారు.
బేషరతుగా దాడికి పాల్పడిన వారిని, వారికి వెనుక వున్న అసాంఘిక శక్తులపై చర్యలు తీసుకోవడం తో పాటు.. ఇకనైనా చట్టాలు ఉల్లంఘన చేసి వుంటున్న వారిని.. ఆదివాసుల శ్రేయస్సు కొరకు షెడ్యూల్ ప్రాంతం నుంచి పంపిచేయాలని, చట్టాలు అమలు చేస్తూ, ఆదివాసుల కు రక్షణ కల్పించాల్సిన అధికారులు అందుకు విరుద్ధంగా వ్యవహరించే బదులుగా వారి యొక్క ఉద్యోగాలకు రాజీనామా చేయాలని, బాధితుడికి మెరుగైన వైద్యం, న్యాయం జరగక పోతే.. తదుపరి చర్యలు అధికారులు, ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి వస్తుందని అన్నారు.