రిపబ్లిక్ హిందూస్థాన్, హైదరాబాద్ : ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్న షెడ్యూలు కులాల సమస్యలు ను పరిష్కారం కోసం ప్రభుత్వం పై ఒత్తిడి తీసుకరావాలని ఏజెన్సీ కులాల జాయింట్ యాక్షన్ కమిటీ సభ్యులు కంగ్రెస్ పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని కలిసి వినతిపత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా ఉమ్మడి నాయకులు మాట్లాడుతూ ఆదిలాబాద్ జిల్లా మరియు ఏజెన్సీ షెడ్యూల్డ్ కులాల సమస్యలను పరిష్కరించి, వంద సంవత్సరాలకు పూర్వం నుంచి సాగుచేస్తున్న అసైన్మెంట్ పరంపోకు భూములు మరియు ఖరిశ ప్రతి దళిత కుటుంబానికి డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
3 ఎకరాల భూమి, ప్రతి కుటుంబానికి 30 లక్షల ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని అన్నారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ కల్పించిన హక్కు 15% విద్య ఉద్యోగ మరియు రాజకీయ రంగాల్లో ఖచ్చితంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు.
హుజురాబాద్ లో ఎట్లయితే ప్రతి దళిత కుటుంబానికి 10 లక్షలు ఇస్తున్నారో ఏజెన్సీ ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రతి దళిత కుటుంబానికి 10 లక్షల పైలెట్ ప్రాజెక్టును మొదట ఏజెన్సీ ప్రాంతంలో అమలు చేయాలని డిమాండ్ చేస్తూ మెమోరాండం ఇవ్వడం జరిగిందని తెలిపారు.
రేవంత్ రెడ్డిని కలిసిన వారిలో ఏజెన్సీ షెడ్యూల్ కులాల జాయింట్ యాక్షన్ కమిటీ జిల్లా అధ్యక్షులు లింగంపల్లి చంద్రయ్య కన్వీనర్ బిరుదుల లాజర్ అధికార ప్రతినిధి అరకిల్ల అశోక్ దూట రాజేశ్వర్ పాల్గొని మెమొరాండం ఇచ్చారు. దీనికి రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించి త్వరలోనే ప్రభుత్వంపై ఒత్తిడి పెంచి షెడ్యూల్డ్ కులాలకు న్యాయం జరిగే విధంగా చూస్తామని పిసిసి అధ్యక్షులు తెలపడం జరిగిందని తెలిపారు.