ఆశ్రమ పాఠశాల విద్యార్థులను పరామర్శించిన విద్యార్థి సంఘాల నాయకులు
ఘటనకు బాధ్యత వహిస్తూ మంత్రి సత్యవతి రాథోడ్ రాజీనామా చేయాలని ఏ.ఐ.ఎస్.బి రాష్ట్ర అధ్యక్షులు హకీం నవీద్ డిమాండ్
రిపబ్లిక్ హిందుస్థాన్, వరంగల్ : సోమవారం సాయంత్రం వర్ధన్నపేట గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు నాణ్యత లేని ఆహారం తిని 50 మంది అస్వస్థతకు గురయ్యారు. చికిత్స పొందుతున్న విద్యార్థులను విద్యార్థి సంఘాల నేతలు ఆసుపత్రికి వెళ్లి పరామర్శించారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు హకిం నవీద్ ఏ.బి.ఎస్.ఎఫ్ జిల్లా అధ్యక్షుడు బొట్ల నరేష్ మంగళవారం స్థానిక స్థానిక పాఠశాల విద్యార్థులతో మాట్లాడి పాఠశాల నెలకొన్న సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు.
ఈ మాట్లాడుతూ కేసీఆర్ ప్రభుత్వం ప్రభుత్వ గిరిజన, దళిత, మైనార్టీ హాస్టల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించడంలో వైఫల్యం చెందిందనడానికి నిన్న జరిగిన ఘటనే నిదర్శనమని అన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో వరుసగా గిరిజన గురుకుల పాఠశాలలో అనేక సంఘటనలు చోటు చేసుకున్నప్పటికీ సంబంధిత అధికారులు పర్యవేక్షణను గాలికి వదిలేసి నిర్లక్ష్యంగా వ్యవహరించడం వలనే దాదాపు 50 మంది విద్యార్థులు అస్వస్థకు గురయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. గిరిజన శాఖ మంత్రి ఉమ్మడి జిల్లా నుంచి ప్రస్థానం వహిస్తున్నప్పటికీ గిరిజన పాఠశాలల దుస్థితి మాత్రం మారలేదన్నారు. తక్షణమే ఈ సంఘటనకు బాధ్యత వహిస్తూ గిరిజన శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. రాబోయే రోజుల్లో గిరిజన దళిత మైనార్టీ గురుకులలో అధికారుల పర్యవేక్షణ వేగవంతం చేసి భవిష్యత్తులో ఇట్లాంటి సంఘటన పురాతన కాకుండా కలెక్టర్ చొరవ తీసుకోవాలనీ అన్నారు.