Friday, April 11, 2025
Homeజాతీయంట్రాఫిక్ ఫైన్ల టార్చర్ భరించక బైక్ కి నిప్పు పెట్టేశాడు

ట్రాఫిక్ ఫైన్ల టార్చర్ భరించక బైక్ కి నిప్పు పెట్టేశాడు


రిపబ్లిక్ హిందుస్థాన్ , ఆదిలాబాద్ : ఆదిలాబాద్ జిల్లా కేంద్రం లో ఓ అనూహ్య ఘటన జరిగింది. ట్రాఫిక్ పోలీసులు వేస్తున్న చాలన్లతో విసుగు చెందిన ఓ వ్యక్తి ఏకంగా తన ద్విచక్ర వాహనాన్ని ప్రధాన చౌరస్తా లో రోడ్డు మధ్య లో పెట్టి నిప్పు పెట్టి తగలబెట్టేశాడు. చిన్న గల్లీల గుండా చిన్న పనులకు బయటకు వెళుతున్న ఇష్టం వచ్చినట్లు ఫైన్లు వేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ వ్యక్తి చేసిన పనికి అక్కడ ఉన్న జనం సైతం సపోర్ట్ చేశారు. జై జవాన్ జై కిసాన్ నినాదాలు చేస్తూ అతనికి మద్దతు పలికారు. అక్కడ ఉన్న ట్రాఫిక్ పోలీసులు ఆ వ్యక్తి చేసిన పనికి ఒక్కసారిగా అవాక్కయ్యారు.

ఆ వ్యక్తి తరచూ తన బైకుకు చలాన్‌లు విధిస్తున్నారు అని ఆగ్రహంతో తన వాహనాఇకి నిప్పు కున్న వ్యక్తి తన ఆవేదన ను వ్యక్తం చేశాడు.

ఓ వైపు పెట్రోల్ ధర మోత మోగిపోతుంటే ద్విచక్ర వాహనం బయటికి తీయాలంటేనే భయమేస్తుందని, మరోవైపు ట్రాఫిక్ చలాన్‌లతో బెంబేలెత్తి పోవాల్సి వస్తుందని పేర్కొన్నారు. భారీ జరిమానాలతో ద్విచక్రవాహనదారులు అల్లాడిపోతున్నారని.. ఏదో ఒక్క సందర్భంలో వాహనాలు బయటకు తీసి రోడ్డు మీదకు వెళ్లితే.. చలాన్ చెల్లించాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేసాడు. ఆదిలాబాద్ జిల్లాలో ఆ వ్యక్తి పోలీసులకు షాక్ ఇచ్చాడు. ట్రాఫిక్ చలాన్ చెల్లించమని అన్నందుకు కోపంతో తన బైకును తగులబెట్టేసి నిరసన వ్యక్తం చేసాడు.

ద్విచక్రవాహనంపై చలాన్లు వారం క్రితం వెయ్యి రూపాయలు చెల్లించానని వాహనాదారుడు వాపోయాడు. అయినా తనిఖీల్లో భాగంగా అధికారులు చలాన్‌లు పెండింగ్‌లో ఉన్నాయని.. కొంత డబ్బు చెల్లించాలని అడిగారు. దీంతో వారం కిందటే చలాన్ కట్టానని, ఎక్కడి నుంచి డబ్బులు తేవాలంటే వాహనదారులు అసహనానికి గురై బైకుకు నిప్పు పెట్టాడు.

వెంటనే ట్రాఫిక్ పోలీసులు నీళ్లు తీసుకొచ్చి మంటలార్పారు. ప్రతి సామాన్యుడు ఇదే విధంగా భావిస్తున్నాడు. పేద ప్రజలకు మాత్రమే అన్ని నియమాలు పాటించాలని ఒత్తిడి చేస్తారని , కానీ రాజకీయ నాయకులకు, ప్రజాప్రతినిధులకు దగ్గరుండి బైక్ ర్యాలీ జరుపుతారని ప్రజలు మనోవేదన గురవుతున్నారు. కరోన కష్టకాలంలో పనులు దొరక్క , ఆదాయం తగ్గి అల్లాడిపోతున్నా సామాన్యులు ట్రాఫిక్ చలన్ల విసుగు చెందుతున్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Need Help?