కరుడు గట్టిన మేవాత్ గ్యాంగ్ నేరగాళ్లు గా గుర్తింపు..
సమాచారం వెల్లడించిన
జిల్లా ఎస్పీ కె.కె.ఎన్ అన్బురాజన్ ఐ.పి.ఎస్
ఆంధ్రప్రదేశ్ : కడప నగరంలో సంచలనం సృష్టించిన ఏటీఎంల దొంగతనానికి పాల్పడిన హర్యానా రాష్ట్ర మేవాత్ గ్యాంగ్ దొంగల ముఠా అరెస్ట్..కేవలం 4 రోజుల వ్యవధిలోనే దొంగలను అరెస్టు చేసిన కడప పోలీసులు..

వీరి వద్ద నుండి 9.5 లక్షల రూపాయల నగదు, లారీ, రెండు నాటు తుపాకులు, సుమారు 20 కేజీల గంజాయి, రెండు చిన్న గ్యాస్ సిలిండర్ లు, ఒక చిన్న ఎల్పీజీ సిలిండర్, 40 దేశీ ఇతర రాష్ట్రాల మద్యం బాటిళ్లు, దొంగతనానికి ఉపయోగించిన గ్యాస్ కట్టర్, రెండు పొడవాటి పైపులు, నల్లని రంగు స్ప్రే డబ్బా, ఇనుప సమ్మెట, జంపర్ రాడ్లు, ఐరన్ కట్టర్, పొడవాటి స్క్రు డ్రైవర్, అడ్జస్టబుల్ స్పానర్, కేబుల్ కట్టర్, రెండు గ్యాస్ రిలీసింగ్ స్పానర్లు, రెండు ఇనుప నిచ్చెన లు స్వాధీనం.

పట్టుబడ్డ ఇద్దరు నిందితులు హర్యానా కు చెందిన కరుడు గట్టిన మేవాత్ గ్యాంగ్ నేరగాళ్లు గా గుర్తింపు..
ఈ నెల 7 తెల్లవారు జామున రిమ్స్, చింతకొమ్మ దిన్నె పరిధిలో ఏటీఎం లను పగులకొట్టి 41 లక్షల రూపాయల ను దొంగిలించిన ముఠా..

అత్యాధునిక పరికరాలు ఉపయోగించి దొంగతనం చేసిన దొంగలు..
దొంగలను పట్టుకునేందుకు కృష్ చేసిన సిబ్బందిని జిల్లా ఎస్పీ కె.కె.ఎన్ అన్బు రాజన్ ఐ.పి.ఎస్. అభినందించారు.
దొంగలను అరెస్టు చేసి నగదు స్వాధీనం చేసుకోవడంలో విశేష కృషి చేసిన కడప డి.ఎస్.పి బి.వెంకట శివారెడ్డి, సి.సి.ఎస్ డి.ఎస్.పి బాలస్వామి రెడ్డి, వారి సిబ్బంది ఇన్స్పెక్టర్ లు కె.అశోక్ రెడ్డి, శ్రీరామ శ్రీనివాసులు, నరేంద్ర రెడ్డి మరియు ఎస్.ఐ లు మంజునాథ్ రెడ్డి, ఎస్.కె రోషన్, ఎన్.రాజరాజేశ్వర రెడ్డి, మధుమల్లేశ్వర రెడ్డి, సిబ్బంది ని జిల్లా ఎస్పీ కె.కె.ఎన్ అన్బురాజన్ ప్రత్యేకంగా అభినందించి రివార్డులు అందించారు.