గ్రామంలో పిచ్చికుక్క స్వైర విహారం…
5 గురు వ్యక్తులు,ఒక బాలుడిపై , పలు పశువులపై దాడి… తీవ్ర గాయల
6 గురికి గాయాలు రిమ్స్ కు తరలింపు..
రిపబ్లిక్ హిందుస్థాన్, ఇచ్చోడ :
అదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం డిజిటల్ విలేజ్ ముఖరా (కే) గ్రామంలో ఓ పిచ్చి కుక్క స్వైర విహారం చేసింది. గ్రామం లో ఓ పిచ్చికుక్క దారికి అడ్డొచ్చిన్న వారి పై విచక్షణ రహితంగా దాడి చేసింది.
గ్రామ వీధులలో స్వైర విహారం చేస్తు తన దారీలో వచ్చిన మనుషులపై, పశువులపై వరుసగా దాడి తీవ్రగాయల పాలు చేసింది. కుక్క దాడిలో గ్రామానికి చెందిన ఆయిదుగురు వ్యక్తులకు తీవ్ర గాయాలు కాగా రిమ్స్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు. గాయాలపాలైన వారిలో ఒక బాలుడు సైతం ఉన్నాడు.
గ్రామం లో కుక్కల హడావిడి ఉన్నా పంచాయితీ అధికారులు చర్యలు తీసుకోవడం లో విఫలం అయినట్లు తెలుస్తుంది.