తెలంగాణాలో పెరుగుతున్న జర్నలిస్టుల పై భౌతిక దాడులు …
రిపబ్లిక్ హిందుస్థాన్, మంచిర్యాల (ఫిబ్రవరి 25) : మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలంలోని సుద్దాల గ్రామంలో వార్త సేకరణ కోసం వెళ్లిన జర్నలిస్టుల పై జరిగిన దాడిని డెమోక్రటిక్ జర్నలిస్ట్ ఫెడరేషన్ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు తీగల శ్రీనివాస్ రావు ఖండించారు. దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.ఈ మధ్య కాలంలో జర్నలిస్టుల పైన భౌతిక దాడులు అధికమౌతున్నాయని అన్నారు. ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉంటూ ప్రజా సమష్యల పరిష్కరానికి అనునిత్యం కృషి చేస్తున్నా జర్నలిస్టుల పైన దాడులను చెహించేది లేదని, ఇలాంటి దాడులు జరుగకుండా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.