ఆదిలాబాద్ కలెక్టరేట్ , రిపబ్లిక్ హిందుస్థాన్ : ప్రపంచ వ్యాప్తంగా ఉన్న బంజారాల ఆరాధ్య ధర్మ గురువు శ్రీ శ్రీ శ్రీ సంత్ సద్గురు సేవాలాల్ మహారాజ్ జయంతి ఫిబ్రవరి 15వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు, ప్రభుత్వ , ప్రైవేటు రంగ సంస్థలకు అన్నింటికీ సేవాలాల్ మహారాజ్ జయంతి సందర్భంగా ప్రభుత్వ సెలవు దినంగా ప్రకటించాలని కలెక్టరేట్ సిక్త పట్నాయక్ ను , జడ్పీఛైర్మన్ రాథోడ్ జనార్ధన్ లను కలిసి లంబాడిల ఐక్యవేదిక నాయకులు వినతిపత్రం అందజేశారు.

ఈ సందర్భంగా లంబాడీల ఐక్యవేదిక రాష్ట్ర కార్యదర్శి రాథోడ్ సుధాకర్ నాయక్ మాట్లాడుతూ దేశ జనాభాలో 14 కోట్ల జనాభా కలిగిన బంజారాలు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న లంబాడాల ఆరాధ్యదైవమైన శ్రీ శ్రీ శ్రీ సంత్ సద్గురు సేవాలాల్ మహరాజ్ జయంతిని ప్రభుత్వ సెలవు దినంగా ప్రకటించి ప్రభుత్వమె జయంతిని అధికారికంగా నిర్వహించాలని కోరారు. సిక్కుల ఆరాధ్యదైవమైన గురునానక్ జయంతి, మహమ్మద్ ప్రవక్త జయంతిని ఏ విధంగా సెలవుదినంగా చేర్చారో అదేవిధంగా 40 లక్షల జనాభా ఉన్న లంబాడాల ఆరాధ్య దైవమైన సేవాలాల్ మహరాజ్ జయంతి ని సెలవు దినంగా ప్రకటించాలని అన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ స్పందించి పై అధికారులకు పంపిస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కో ఆర్డినేటర్ లు అడే సునీల్ నాయక్ , ఆర్డినేటర్ జాధవ్ వసంత్ రావు నాయక్ , జిల్లా ఇంఛార్జి మహేందర్ , కార్యదర్శి సేవాదాస్ నాయక్ , జిల్లా అడిషనల్ కో ఆర్డినేటర్ సురేష్ నాయక్ బాణోత్ , రవీందర్ నాయక్ , బోథ్ ఖానాపూర్ అసెంబ్లీ కో ఆర్డినేటర్ పవార్ సుధన్ నాయక్ , జాధవ్ వినోద్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.
