రిపబ్లిక్ హిందుస్థాన్ , ఆదిలాబాద్ : ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం లోని జల్దా గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. దాహం వేయగా బావిలో నీళ్లు తాగడానికి వెళ్లిన మహిళ కాలు జారీ ప్రమాదవశాత్తు అందులో పడి మృతిచెందింది. ఇచ్చోడ ఎస్సై షేక్ ఫరిద్ తెలిపిన వివరాల ప్రకారం , మరియు మృతురాలి అన్న తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి… గిరిజన తెగకు చెందిన బోమలే బాగిరత అలియాస్ గంగ బాయి (29) కి ముగ్గురు అన్నదమ్ములకు ఒక్కటే చెల్లెల్లు. భాగీరత కు ఎనిమిది సంవత్సరాల క్రితం వివాహమైంది. అయితే అప్పటినుండి జలదా గ్రామంలో నే నివసిస్తున్నట్లు తెలిపారు. ఆదివారం రోజు రోజు లాగానే కౌలుకు తీసుకున్న వ్యవసాయ భూమిలో పత్తి పంటను ఎరడానికి వెళ్లారు. బాగిరత తన ఆమె వదినలయిన గయ బాయితో కలిసి మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో అక్కడే ఉన్న బావిలో నీళ్లు తాగడానికి వెళ్లారు.
బాటిలో నీటిని నింపే క్రమంలో భాగీరత బాయి కాలు జారీ బావిలో పడిపోయింది. ఆమె వదిన గయ బాయి కేకలు వేసి చుట్టూ పక్కల వారిని పిలవగా అప్పటికే ఆమె బావిలో మునిగిపోయింది. ఈత రాకపోవడంతో చనిపోయినట్లు మృతురాలి అన్న ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు. మృతురాలి కి ఒక పాప ఒక బాబు ఉన్నారు. ఈ మెరకు కేసు నమోదు చేసుకున్నట్లు పేర్కొన్నారు.