రిపబ్లిక్ హిందూస్థాన్, బజార్హాత్నుర్ : నిరుద్యోగుల కోసం జాబ్ మేళా ను నిర్వహిస్తున్నట్లు బజారిహాత్నుర్ ఎస్సై ఉదయ్ కుమార్ తెలిపారు. ప్రముఖ జీఎంఆర్(GMR) లో ఖాళీలు ఉన్నట్లు పేర్కొన్నారు. ఈ నెల 16 వ తేదీన బజార్ హత్నుర్ పోలీస్ స్టేషన్లో జాబ్ మేళా ఉంటుందని అన్నారు. అర్హత పదవ తరగతి పాసై , ఎత్తు 167cm లు ఉన్న అభ్యర్థులు జాబ్ మేళా కోసం వచ్చే అభ్యర్థులు తమ వెంట ధ్రువీకరణ పత్రాలు జిరాక్స్ కాపీలు తీసుకుని రావాలని అన్నారు.
