స్కూటీ పై ఉన్న ఇద్దరికి తీవ్రగాయలు….
ప్రమాదంలో నుజ్జు నుజ్జు అయినా బాలిక కాళ్లు
ఒకరి మృతి….
బంధువుల ఇంట్లో శుభకార్యానికి వెళ్లి వస్తున్న క్రమంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..నేరడిగొండ మండలంలోని నారాయణపురం గ్రామంలో తన బంధువుల ఇంట్లో జరిగిన శుభకార్యానికి హాజరై బజార్హత్నూర్ మండలంలోని భూతయ్ గ్రామానికి చెందిన ఇద్దరు స్కూటీపై ఇంటికి వెళ్తున్న క్రమంలో ఇచ్చోడ మండలం ఇస్లాం నగరం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.
ఈ ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ప్రమాదంలో బాలిక రెండు కాళ్ళు మొత్తం నుజ్జునుజ్జు అయ్యాయి. క్షతగాత్రులను చికిత్స కోసం రిమ్స్ కు తరలించారు.